ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం సంబంధం లేకుండా అన్ని వయసులో వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వాటిని తగ్గించుకోవడం కోసం లేదా దాచిపెట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ వాడుతున్నారు. కానీ వాటిలో ఉండే కెమికల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల వెంట్రుకలను అయిదు నిమిషాల్లో నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక కప్పు వెల్లుల్లిపాయ పొట్టును తీసుకోవాలి.
మనం బయట పడేసే వెల్లుల్లి పొట్టు వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఒక ఇనుప కడాయి తీసుకొని ఒక కప్పు వెల్లుల్లిపాయ పొట్టు, ఒక కప్పు గోరింటాకు వేసి నల్లగా మాడేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీనిని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. దీనికోసం మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. గరిటతో అటు ఇటు మెదిపితే మెత్తగా అయిపోతుంది. ఈ పౌడర్ ను ఒక బౌల్ తీసుకొని మీ జుట్టుకు సరిపడినంత వేసుకుని దానిలో ఒక చెంచా కాఫీ పౌడర్ వేసుకొని మీ జుట్టుకు సరిపడినంత కొబ్బరి నూనె వేసి కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదళ్ల నుండి చివరి వరకు అప్లై చేసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఒక గంట తర్వాత ఏదైనా మైల్డ్ షాంపుతో తల స్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు పాడవదు. వారానికి ఒకసారి అప్లై చేయడం వలన రెండు సార్లు అప్లై చేసేసరికి జుట్టు నల్లగా మారుతుంది. ఒక గిన్నెలో ఒక చెంచా మనం తయారుచేసుకున్న పొడిని వేసుకుని దానిలో ఒక చెంచా అలోవెరా జెల్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తెల్ల వెంట్రుకలు ఉన్న భాగంలో అప్లై చేసుకోవాలి.
ఏదైనా ఫంక్షన్ కి లేదా బయటకి వెళ్ళాలి అనుకున్నపుడు ఇన్స్టంట్ గా ఈ చిట్కా ఉపయోగపడుతుంది. ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ఇన్సిడెంట్ గా ఉపయోగించుకోవచ్చు లేదా వారానికి ఒకసారి ప్యాక్లా కూడా ఉపయోగించుకోవచ్చు. మీకు అవసరం అనిపించినప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒక చిట్కాను ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఉపయోగించినవన్నీ నేచురల్ పదార్థాలు. కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్రయత్నాలు చేసి విసిగిపోయాం అనుకున్న వారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుంది.