ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. తెల్ల వెంట్రుకలు ఉండడం వలన నలుగురిలోకి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అందుకని వాటిని దాచిపెట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డై లను ఉపయోగిస్తారు. వీటిలో అనేక రకాల కెమికల్స్ ఉండడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి హెయిర్ డైలు ఉపయోగించినప్పటికీ తెల్ల వెంట్రుకలు శాశ్వతంగా మాత్రం పోవు. ఎటువంటి కెమికల్స్ లేకుండా తెల్ల వెంట్రుకలు నల్లగా చేసుకోవడానికి పాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఒక ఇనుప కడాయి తీసుకొని దానిలో ఒక కప్పు హెన్నా పౌడర్ ను వేసుకోవాలి. 2 గ్లాసుల నీళ్ళు, మూడు చెంచాల టీ పొడి వేసుకుని డికాషన్ మరిగించి ముందుగా పక్కన పెట్టు కోవాలి. హెన్నా పౌడర్ లో కొంచెం కొంచెం గా డికాషన్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఒక రాత్రంతా లేదా రెండు, మూడు గంటల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపాలి. ఇది కొంచెం బ్లాక్ కలర్ లోకి మారుతుంది.
దీనిని వైట్ హెయిర్ ఉన్న చోట బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక గంట సేపు ఉండనిచ్చి తర్వాత నీటితో కడిగేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇనుప కడాయి తీసుకొని దానిలో ఒక కప్పు ఇండిగో పౌడర్ ను వేసుకోవాలి. తర్వాత దీనిలో గోర్వెచ్చని నీళ్లు వేసుకుని అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి రెండు గంటల పాటు ఉండనివ్వాలి. నమోదు తీసేసరికి ఇది కూడా బ్లాక్ కలర్ లోకి మారుతుంది.
దీన్ని ఒకసారి బాగా కలుపుకొని జుట్టుకు అప్లై చేసుకున్న ఒక గంట సేపు ఉన్న తర్వాత తలస్నానం చేయాలి. ఈ రెండు ప్యాక్లను వెంట వెంటనే ఒకేరోజు ఉపయోగించాలి. వేరువేరుగా ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీనిలో ఎటువంటి కెమికల్స్ ఉండవు. కాబట్టి దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది జుట్టును నల్లగా చేయడమే కాకుండా జుట్టు కుదుళ్లు బలంగా చేస్తుంది.