white hair to black hair home remedy

కెమికల్ డై అవసరం లేదు. ఇక నెలలో ఒకసారి అప్లై చేయండి చాలు.

జుట్టు ఆరోగ్యంగా, అందంగా మెరుస్తూ పెరగాలంటే తెల్ల జుట్టు రాకుండా అడ్డుకోవాలంటే మనం అప్పుడప్పుడు హెన్నా పెట్టుకోవడం చాలా అవసరం. ఇది జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేస్తుంది. తలలో వేడిని తగ్గిస్తుంది. జుట్టు నల్లగా, బలంగా పెరిగేందుకు సహాయపడుతుంది. అయితే దీనికోసం హెన్నా ఎలా కలుపుకోవాలో తెలియని వారి కోసం ఇప్పుడు హెన్నా ఎలా కలుపుకోవాలో చూద్దాం. దీని కోసం మనం ఐరన్ ఫ్యాన్ తీసుకొని దానిలో ఒక గ్లాసు నీటిని వేయాలి. తర్వాత ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి.  మెంతి గింజలు మీకు ఆరోగ్యకరమైన మరియు పోషణతో కూడిన జుట్టును పొందడానికి సహాయపడతాయి.  

మెంతి గింజలతో మీరు చుండ్రు, పొట్టు, జుట్టు రాలడం మరియు ఇతర జుట్టు సమస్యలకు వీడ్కోలు చెప్పవచ్చు.  మెంతి గింజలు జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తాయి, జుట్టు ఒత్తుగా మరియు ఆరోగ్యంగా పెరుగుతుంది. తర్వాత ఒక స్పూన్ కాఫీ పొడి వేసుకోవాలి కాఫీపొడిని సమయోచితంగా వెంట్రుకలు మరియు స్కాల్ప్‌కి అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోయి తిరిగి పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక 2007 ప్రయోగశాల అధ్యయనంలో మగ వెంట్రుకల కుదుళ్లలో DHT యొక్క ప్రభావాలను నిరోధించడంలో కెఫిన్ సహాయపడిందని కనుగొంది. 

ఇప్పుడు నీరు బాగా మరిగిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ ఐరన్ ప్యాన్లో ఒక కప్పు హెన్నా వేసుకోవాలి. ఇందులో మనం మరగపెట్టుకున్నా మెంతులు, కాఫీ పౌడర్ నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రాత్రంతా మూత పెట్టి అలాగే వదిలేయాలి. ఇది మరుసటిరోజుకు నల్లగా మారుతుంది. చుండ్రు సమస్య ఉన్నవారు స్పూన్ పుల్లటి పెరుగు కలుపుకోవాలి.

తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేసుకుంటూ ముడిలా వేసుకోవాలి. ఒక 30, 40 నిమిషాల తర్వాత మామూలు నీటితో తలస్నానం చేయాలి. ఆ రోజు సాయంత్రం కొబ్బరినూనె అప్లై చేయాలి. హెన్నా వలన జుట్టు పొడిబారకుండా జుట్టు తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. మరుసటి రోజు ఏదైనా హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా ఈ టిప్స్ పాటిస్తూ చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా రెండు రెట్లు అధికంగా ఫాస్ట్ గా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!