ఇప్పుడు అందరికీ వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. అవి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా నలుగురిలో అవహేళనలు గురయ్యేలా ఉంటుంది పరిస్థితి. చాలామంది వాటికి రకరకాల డైలు, రంగులు వాడి విసిగిపోయారు. అయితే ఈ చిట్కా పాటించి చూడండి. ఇంట్లో దొరికే సాధారణ పదార్థాలుతో జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తక్కువ ఖర్చుతో నల్లని జుట్టు పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.
స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. అందులో గ్లాసు నీళ్ళుపోసి ఒకస్పూన్ టీపొడి వేయాలి. అది బాగా మరిగి టీపొడిలోని సారం నీటిలోకి దిగి డికాక్షన్ రెడీ అవ్వాలి. ఇంతలో ఒక గిన్నెలో రెండు స్పూన్లు కాపీపొడి తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఇది బాగా కలిసేలా కలిపి అందులో ఆల్రెడీ తయారు చేసి పెట్టుకొన్న టీ డికాషన్ కలపాలి. తలకు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఈ పేస్ట్ ను తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులో పసుపు కూడా కలుపుకోవాలి.
పసుపు తలపై ఉండే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఎటువంటి బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా అడ్డుకోవడంలోనూ సహయపడుతుంది. ఈ పేస్ట్‌ని బాగా కలిపి తలకు అప్లై చేయాలి అప్లై చేసిన అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు జుట్టు నల్లగా అయ్యేంతవరకు చేస్తూ ఉండాలి. ఒకటి, రెండు సార్లు ప్రయత్నించి ఫలితం లేదని వదిలేస్తే లాభం ఉండదు. ఇందులో వాడిన పదార్థాలన్నీ సహజమైనవి గనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాఫీ పొడి, టీ డికాక్షన్ తలకి మంచి డై లాగ పనిచేస్తాయి.
అలాగే నిమ్మరసం తలకి బ్లీచ్ గా పనిచేసి జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో వాడిన పదార్థాల వలన మన జుట్టు కూడా మెత్తగా తయారవుతుంది. కొంతమంది జుట్టు ఎండిపోయినట్టు ఉండేవాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. సహజంగా ఇంట్లోనే దొరుకుతాయి కనుక పెద్దగా ఖర్చు పెట్టకుండానే నల్లని జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారిగా వదిలేయకుండా కనీసం రెండు, మూడు వారాలు ప్రయత్నించడం మంచిది. ఇవి సహజమైన చిట్కాలు ఫలితం కొంచెం ఆలస్యం అవుతుంది.కానీ శాశ్వత పరిష్కారం లభిస్తుంది.