White Hair To Black Hair Naturally In Telugu

5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా చేసే అద్భుతమైన చిట్కా

 ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్లవెంట్రుకలు వస్తున్నాయి. చిన్న వయసు వారు తెల్ల వెంట్రుకలు రావడం వల్ల నలుగురిలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు.  వాటిని దాచిపెట్టడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ డైస్  ఉపయోగిస్తారు. మార్కెట్లో దొరికే హెయిర్ డైస్  అనేక రకాల కెమికల్స్ కలిగి ఉంటాయి.  మార్కెట్లో దొరికే హెయిర్ కలర్స్ ఉపయోగించడం వల్ల నల్ల వెంట్రుకలు కూడా తెల్లగా మారిపోతాయి. 

     అప్పటికి తాత్కాలిక పరిష్కారం లభించినప్పటికీ ముందు ముందు అనేక ఇబ్బందులు కలుగుతాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ హెయిర్ డై  ట్రై చేసినట్లయితే తెల్ల వెంట్రుకలు రావడం తగ్గిపోతాయి.  వచ్చిన  తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి. కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని మీరు ప్రతి రోజూ ఉపయోగించే షాంపూ  మూడు చెంచాలు తీసుకోవాలి.  తర్వాత దీంట్లో రెండు చెంచాల అలోవెరా జెల్ వేసుకోవాలి. మార్కెట్లో దొరికే  జెల్  లేదా ప్లాంట్ బేస్ జెల్  అయినా పర్వాలేదు.  

       ఈ రెండింటిని బాగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని మూడు చెంచాల టీ పొడిని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత దీన్ని కిచెన్  రోలులో వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకొన్న షాంపూలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది జుట్టు నల్లబడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో ఉపయోగపడుతుంది.  దీనిలో రెండు చెంచాల మందార పొడి వేసుకోవాలి. దీనికోసం మార్కెట్లో దొరికే మందార పొడి లేదా మన ఇంట్లో తయారు చేసుకునే మందార పొడి  అయినా సరే ఉపయోగించుకోవచ్చు. 

        వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకుని బాగా కలిపి హెయిర్ కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా  చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి ఒక గంట తర్వాత నీటితో  కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వెంటనే తెల్ల వెంట్రుకలు  నల్లగా మారిపోతాయి. కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. ఎటువంటి కెమికల్స్ ఉపయోగించలేదు కాబట్టి దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా  అన్ని వయసుల వారు ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!