ఇప్పటిరోజుల్లో చాలామంది చిన్నవయసులోనే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య బయట ఉండే కాలుష్యం, నీటి నాణ్యతలో హెచ్చుతగ్గులు, తినే ఆహరంలో ఉండే రసాయనాలు అన్నీ కారణాలుగా మారుతున్నాయి. మొదట్లో కనిపించిన ఒకటి రెండు వెంట్రుకలను కత్తిరించడం చేస్తుంటారు. తర్వాత ఎక్కువ మొత్తంలో కనిపించడంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్య కు అనారోగ్య లక్షణాలు కూడా కారణమవుతాయి.
పీసీఓడి, కాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ, థైరాయిడ్, హార్మోన్ సమస్యల వలన, కొన్ని మందుల ప్రభావం వల్ల కూడా మెలనిన్ ఉత్పత్తి తగ్గి జుట్టు తెల్లబడుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి
ముఖ్యంగా వంశపారంపర్యంగా కూడా రావచ్చు. అనేక విటమిన్ లోపాలు కూడా తెల్లజుట్టు రావడానికి దోహదపడతాయి. తెల్లజుట్టు రాగానే చాలామంది మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన డైలు వేస్తారు. వీటివలన రసాయనాలు ప్రభావం వలన జుట్టుపై దుష్ప్రభావాలు చూపుతున్నాయి. జుట్టు రాలిపోవడం, జుట్టు చిట్లడం, ఎలర్జీ లాంటివి.
అలాంటి రసాయనాలు లేని ఇంటి చిట్కాలతో మీ జుట్టు నల్లబరుచుకోవచ్చు. దానికోసం మనకు కావలసిన పదార్థాలు స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఉసిరిపొడి. అరకప్పు నూనె లో రెండు చెంచాల ఉసిరిపొడి వేసి కలపాలి. సన్నని మంటపై నల్లగా అయ్యేంతవరకూ మరిగించి చల్లారిన తర్వాత వడకట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు తలకు రాసి మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడంవలన సహజంగా జుట్టు నల్లబడి కొత్తగా తెల్లజుట్టు రాకుండా చేస్తుంది.
కొబ్బరినూనె వాడడం వలన చుండ్రు తగ్గుతుంది. జుట్టుకు తేమను అందించి జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. ఇది యాంటీ మైక్రోబయల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న సహజ పోషకాలలో ఒకటి. దెబ్బతిన్న జుట్టు పరిస్థితి ని మెరుగుపరుస్తుంది. ఉసిరిపొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మరియు అత్యవసర కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. మాడును ఉసిరి నూనెతో మర్ధనా చేయడం వలన మాడు ఆరోగ్యం పెంపొందుతుంది. కుదుళ్ళను బలంగా చేసి ,జుట్టు రాలడం తగ్గి, జుట్టును నల్లగా చేస్తుంది. జుట్టును మెరిసే లా చేస్తుంది.