జుట్టు తెల్లగా మార్చే సమస్యకి ఎన్ని రకాల ప్రోడక్ట్ వాడిన కొన్ని రోజులకు ఆ రంగుపోతుంది. మళ్లీ జుట్టుకు రంగు వేయాల్సిందే. కానీ కెమికల్స్ నిండిన ఈ రంగుల కంటే సహజంగా తయారుచేసుకున్న ఒక రకమైన రంగు మీ జుట్టును కాలక్రమంలో నల్లగా మార్చడంలో మీకు సహాయపడుతుంది. పూర్వ కాలం నుండి వాడుతున్న అలాంటి హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలో, దానిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక ఐరన్ ఫ్యాన్ తీసుకొని దానిపై రెండు చెంచాల పసుపు వేసుకోవాలి. ఐరన్ ఫ్యాన్ అందుబాటులో లేనివారు నాన్ స్టిక్ ప్యాన్ కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం ఇంట్లో వాడుకునే ఆర్గానిక్ పసుపు వాడుకోవడం మంచిది. దానిని చిన్న మంటపై కలుపుతూ అది నల్లగా అయ్యేంతవరకు వేయించాలి. ఇది వేయిస్తున్నప్పుడు నిప్పులాగ మారుతుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. అది నల్లగా పొడిలాగ వచ్చేంతవరకు వేయిస్తూ ఉండాలి.
మొత్తం నల్లగా మారిన తరువాత స్టవ్ ఆపేసి ఈ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమానికి సరిపడా రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకోవాలి. తర్వాత తలస్నానం చేసిన జుట్టుకు ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రెండు గంటల తరువాత మామూలు నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వలన సహజంగా జుట్టుకు నల్లటి రంగు వస్తుంది. కెమికల్స్ లేని ఈ డై జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడుతుంది.
పసుపులోని యాంటీ ఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
దీనిలో వేసిన కొబ్బరినూనె జుట్టు పొడిబారకుండా చుండ్రు సమస్యలు రాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ముందుగా ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే తలకు అప్లై చేసి స్నానం చేసి వెళ్ళిపోవచ్చు. ఇది రంగు వేసినట్టు కాకుండా సహజమైన రంగును అందిస్తుంది కనుక జుట్టుకు రంగు వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు.