అన్నం తెల్లగా మెరుస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. తెల్లగా మల్లెపూవుల ఉందని మురిసిపోతుంటాం. కానీ ఆ అన్నాన్ని తిని ఎన్ని రకాల జబ్బులు తెచ్చుకుంటున్నామో ఆలోచించం. ఈ తెల్ల అన్నం విషయంలో ఉన్న రహస్యాలు తెలుసుకుందాం. బియ్యం తెల్లగా ఉన్నాయంటే రెండు పాలిష్‌లు పట్టినట్లు. బియ్యంలో ఉండవలసిన పోషకాలన్నీ వాటి పైపొరలోనే ఉంటాయి. తెల్లని బియ్యంలో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండేది బియ్యంలోనే. 78శాతం కార్బోహైడ్రేట్లు తెల్లని బియ్యంలో ఉంటాయి.బియ్యంలో ఉండే పోషకాలన్ని పాలిష్ చేసినపుడు తవుడులోకి వెళ్ళిపోతాయి. మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింక్ చూడండి..
తెల్లని బియ్యం తినే దేశంవారిలో డయాబెటిస్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కువ మధుమేహరోగులు ఉన్న దేశాలు రెండింటిలో చైనా, భారతదేశం ముందున్నాయి. ఈ రెండు దేశాల్లోను తెల్లని బియ్యం ఎక్కువగా వాడుతుంటారు. రక్తంలోకి చక్కెర పదార్థం తొందరగా వెళిపోతుంది. పైపొర లేకపోవడం వలన తెల్లనిబియ్యం ఉడకటం ఈజీ, మింగటం ఈజీ, అరగటం కూడా సులువు. రక్తంలోకి గ్లూకోజ్ లెవల్స్ పెంచేది ఎక్కువే. భారతదేశంలో షుగర్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బియ్యం ఎక్కువగా తినే ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు పంతొమ్మిది ఏళ్ళకే వచ్చేస్తుంది. జీవితకాలం షుగర్ పోదనే అపోహ ఉంది.కానీ అసలుకారణం అన్నం. అన్నం తినడంవలన ట్రైగ్లిజరిడ్స్ త్వరగా పెరుగుతాయి. ట్రైగ్లిజరిడ్స్ గుండెవ్యాధులకు కారణమవుతాయి. ఎక్కువగా చక్కెర శరీరంలో విడుదలయితే దానిని కొవ్వుగా మార్చుకుంటుంది శరీరం.
ఈ కొవ్వు ను ట్రై గ్లిజరైన్స్ అంటారు. ఇది గట్టిపడి రక్తప్రవాహానికి అడ్డుపడుతుంది. ఇది కాలేయంలో చేరి ldl చెడుకొలెస్ర్టాల్ పెరగడానికి సహాయపడుతుంది. బియ్యం తినడంవలన శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పేదవారిలో కూడా చక్కెరవ్యాధి వస్తుంది. ఒకప్పుడు రాగిముద్ద, జొన్నరొట్టెలు తినడంవలన షుగర్ వ్యాధికి దూరంగా ఉండండి. వీలైనంత బియ్యానికి దూరంగా ఉండి పాత పద్దతులకు మారడం మంచిది. బియ్యాన్ని ఎప్పుడైనా పండగలు, ఫంక్షన్లకు పరిమితం చేసి వీలైనంత దూరంగా ఉండండి. ఎప్పుడైనా తినాలనిపించినా స్పూన్లతో వడ్డించుకోండి. ఆ అలవాటు నుండి బయటకు వచ్చి ఇప్పుడైనా షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఇప్పటికే అధికకొవ్వు, మధుమేహం, రక్తపోటు లాంటి జబ్బులతో బాధపడుతుంటే అన్నాన్ని వదిలివేసే సమయం ఇది.