White teeth home remedies

2 నిమిషాల్లో ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా సరే ముత్యాల్లా మెరిసిపోతాయి White teeth home remedies

ఎంత చక్కగా తయారయినా నవ్వినప్పుడు మెరిసే తెల్లటి పళ్ళవరసే ముఖానికి అందం. అలాంటిది ఈ కాలంలో మనం తినే ఆహారం, స్వీట్లు, తాగే కూల్డ్రింకులు, ఆల్కహాల్,  సిగరెట్లు, పాన్ పరాగ్ లాంటి అలవాట్లతో పళ్ళు రంగు మారిపోతున్నాయి. పసుపుపచ్చని పళ్ళు అందరిలో నవ్వడానికి సంశయించేలా చేస్తుంది. దంతాలలో దుర్వాసన, ఆహారంలోని యాసిడ్స్ వలన ఎనామిల్  దెబ్బతిని పళ్ళు పుచ్చిపోవడం లాంటి సమస్యలు తగ్గించడానికి ఈ చిన్న చిట్కా పాటిద్దాం.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 ఈ చిట్కా కోసం మనం తీసుకోవాల్సింది లవంగాలు. దీనిలో లిజనాల్ అనే పదార్ధం ఉంటుంది. లవంగాలు వలన దంతాల చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళవాపుకి చికిత్సలో లవంగాల పొడిని ఎక్కువగా ఉపయోగిస్తారు. లవంగాలను పళ్ళు తోమడానికి ఉపయోగించే పేస్ట్లలో చూస్తూనే ఉంటాం. నోటిదుర్వాసనకు రెండు మూడు లవంగాలను నమిలితే దుర్వాసన తగ్గుతుంది. ఒక ఆరు లవంగాలు తీసుకుని వాటిని పొడి చేసుకోవాలి. అందులో తెల్లటి పేస్ట్ (కోల్గెట్ లాంటివి) కొంచెం వెయ్యాలి. అందులో అరచెక్క నిమ్మరసం కూడా వెయ్యాలి. 

పేస్ట్ లో ఉండే ఎమినో పళ్ళని తెల్లగా చేస్తుంది. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి, విటమిన్ డి కూడా ఉంటుంది. నిమ్మరసం నోట్లో ఉండే బాక్టీరియాను తొలగించడమే కాకుండా గారను తొలగిస్తుంది. తర్వాత కలపాల్సింది బేకింగ్ పౌడర్. ఇది ఎవరికైతే పళ్ళపై ఉండే గారవలన బాక్టీరియా వచ్చి దుర్వాసన, పళ్ళలో పుచ్చు, మురికి పేరుకుని ఉంటుందో వారికి సహాయపడుతుంది. పావుస్పూన్ బేకింగ్ పౌడర్ కలిపాలి. దీనిని బాగా కలపాలి. నురగ వస్తే ఇది తయారయినట్టే. 

దీనిని మొదటిసారి వాడినప్పటి నుంచే తేడా తెలుస్తుంది. ఈ మిశ్రమాన్ని రోజూ పళ్ళు తోముకునేటపుడు పళ్ళు తోమేందుకు వాడే పేస్ట్లా వాడాలి. ఈ మిశ్రమంతో మూడు నుండి నాలుగు నిమిషాలు పళ్ళు తోమాలి. ఆల్కహాల్, మద్యంలాంటి పళ్ళకు హాని చేసే అలవాట్లు మానేయండి. దీనిని వారానికి మూడుసార్లు రోజు మార్చి రోజూ వాడాలి. ఇది వాడడం వలన పళ్ళు తెల్లగా మారడంతో పాటు పళ్ళనొప్పి, దుర్వాసన తగ్గిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!