హాయ్ ఫ్రెండ్స్ ముత్యాల్లాంటి పళ్ళు కావాలన్నది అందరికీ ఉండే కోరికే. ఎందుకంటే అలాంటి పళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరుగా ఉంటుంది. కానీ కొన్ని రకాల కారణాల వల్ల ఈ రోజుల్లో చాలామంది పళ్ళు అసలు తెల్లగా ఉండకపోగా పంటి మీద గార నోటి దుర్వాసన చిగుళ్ల వాపు ఇలాంటి ఎన్నో రకాల దంత సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రౌడీ ని కనుక మీరు పాటిస్తే మీ చిగుళ్లు ఆరోగ్యంగా మారడంతో పాటు మీ పళ్ళు తెల్లగా తల తల లాడుతూ ఉంటాయి ముఖ్యంగా మీ నోటి దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం
- ముందుగా ఒక బౌల్ తీసుకోండి.
- ఒక టీస్పూన్ మోతాదులో పేస్ట్ ను (మీరు వాడే ఏ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదు)తీసుకోండి.
- ఇందులో ఇప్పుడు ఒక చిటికెడు బేకింగ్ సోడాని కలపండి
- ఇప్పుడు ఇందులో కి ఒక అరచెక్క నిమ్మరసం పిండండి
- ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి
ఈ రెమేడి ఎలా వాడాలి
మీరు రెగ్యులర్గా వాడే టూత్ బ్రష్ ని తీసుకొని ఈ మిశ్రమంతో మీరు రోజు ఎలా బ్రెష్ చేసుకుంటారో అలా చేసుకోండి. అయితే మీరు కేవలం ఒక రెండు నిమిషాలపాటు బ్రష్ చేయండి సరిపోతుంది.
ఈ విధంగా మీరు వారంలో ఒక మూడు సార్లు చేస్తే చాలు దీనివల్ల మీ పళ్ళు తెల్ల గా మారడమే కాకుండా గారు కూడా తొలగిపోతుంది. మీ నోట్లో బ్యాక్టీరియా కూడా నాశనం అయ్యి రోజంతా మీ మౌత్ ఫ్రెష్ గా ఉంటుంది. చిగుళ్లవాపు చిగుళ్ల నుంచి రక్తం కారడం ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
బేకింగ్ సోడా మన నోటిలో ఉండే బ్యాక్టీరియాను అంతంచేసి ఇ మన చిగుళ్లు ఆరోగ్యంగా మన పళ్ళు తెల్లగా మెరిసే టట్లు చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి తో పాటు విటమిన్ బి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన నోటిలోని బ్యాక్టీరియాను తరిమి కొట్టడమే కాకుండా మన పళ్లపై ఉండే గారు ని తొలగించి మన పళ్ళు తెల్లగా మెరిసే టట్లు చేస్తాయి