మన శరీరంలో చేరే టాక్సిన్లు అనేక విధాలుగా శరీరాన్ని అనారోగ్యం బారినపడేలా చేస్తాయి. మనం తినే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు, మాంసాహారం, మద్యం వీటిలో ఉండే టాక్సిన్లు శరీరంలో చేరి చెడుప్రభావం చూపుతాయి. ఉదాహరణకు అధికబరువు, మొహంపై మచ్చలు, మొటిమలు, వెంట్రుకలు రాలిపోవడం, తెల్లజుట్టు రావడం, రోజంతా నీరసం అలసట, మెదడు పనితీరు తగ్గిపోవడం, అనేక చర్మ సమస్యలు, గుండె, లివర్, కిడ్నీలో అనేక అనారోగ్య సమస్యలు రావడం శరీరంలో టాక్సిన్లు చేరడం వలన వస్తాయి. ఈ రోజుల్లో మనం తినే ఆహారంలో ఎక్కువ శాతం కల్తీ, పండించేపుడు పురుగుమందులు ఎక్కువగా చల్లడం ఉపయోగిస్తుంటారు. అనేక కెమికల్స్ శరీరంలో కి వెళ్ళడం శరీరంలో అనేక మార్పులు వస్తాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
శరీరంలోపలి నుండి శుభ్రపరచడాన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. డీటాక్సిఫికేషన్ చేయడంవలన అంతర్గత అవయవాలు శుభ్రపడి శరీరంఆరోగ్యంగా ఉంటుంది. డీటాక్సిఫికేషన్ కోసం ఏ పదార్థాలు వాడాలో చూద్దాం రండి. అలోవెరా (కలబంద) తీసుకోవడం వలన శరీరానికి లాక్సమేటివ్ ఇన్ప్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండి శరీరంలో ఇమ్యునిటీని పెంచుతాయి. ప్రేగులలో మలాన్ని శుభ్రపరిచి కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. చర్మం కాంతివంతంగా చేస్తోంది.
గోధుమ గడ్డి:- గోధుమ గడ్డి రసంలో బీటాకెరొటిన్, విటమిన్ ఇ, విటమిన్ సి, తొంభై రకాల మినరల్స్, పద్దెనిమిది రకాల ఎమినో యాసిడ్స్ లభిస్తాయి. అధికబరువును తగ్గిస్తుంది.
బీట్ రూట్ :- శరీరం శుభ్రపరచడంలో బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుంది.ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి అధికమొత్తంలో ఉంటాయి. లివర్ రక్షణ లో మితంగా తాగడంవలన రక్తశాతం పెరిగి లివర్ని రక్షిస్తుంది.
గ్రీన్ టీ కహ్వా :- గ్రీన్ టీ కహ్వా అంటే ఇందులో ఉండే అనేక మసాలాలు శరీరాన్ని శుభ్రపరిచి, ఇమ్యూనిటిని పెంచుతుంది. జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
ఆపిల్ సిడార్ వెనిగర్ :- దీనిని రోజు తప్పించి రోజూ తీసుకోవడం వలన జీర్ణశక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఎసిడిక్ యాసిడ్ మంచి బ్యాక్టీరియా పెంచి చెడు బ్యాక్టీరియా ను తగ్గిస్తుంది. కొవ్వు ను కరిగించి అధికబరువును తగ్గిస్తుంది.
కొబ్బరినీరు:- కొబ్బరి నీళ్ళు తక్షణశక్తిని అందివ్వడంతో పాటు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో కూడా ముందుంటాయి. తాజా కొబ్బరి నీళ్ళలో ఉండే ఎలక్ట్రోలైట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా అంతర్గత అవయవాలను శుభ్రపరుస్తాయి.
రోజు వ్యాయామం చేయడంవలన అధిక కొవ్వు కరిగి శరీరంలో ఉండే చెమట బయటకు వెళ్ళిపోతాయి. మంచినీరు తగినంత తాగండి. దానివలన మూత్రంలో టాక్సిన్లు బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యం గా ఉంటాయి.