Why Are B Vitamins Important to our body

విటమిన్-బి గూర్చి ఆశ్చర్యపరిచే నిజాలు.

బతికినన్ని రోజులు ఆరోగ్యంగా బతకాలి అంటే మన శరీరానికి ఎలాంటి జబ్బు రాకుండా కావలసిన అన్ని పోషకాలు సమర్థవంతంగా అందాలి. అలా మనకు కావలసిన పోషకాల చిట్టా లో విటమిన్స్ ప్రధానమైనవి. వీటిలో విటమిన్-బి  గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 

విటమిన్-బి లో చాలా రకాల విటమిన్లు కలిసి  ఉంటాయి. కాబట్టి దీనిని బి-కాంప్లెక్స్ విటమిన్ అని సాదారణంగా పిలుస్తారు. కొన్నేళ్ల క్రితం పోషకాహారం అంటే మాంసకృత్తులు, పిండి పదార్థాలు, కొవ్వుపదార్థాలు మాత్రమేనని అవి తగు మోతాదులో సక్రమంగా  స్వీకరిస్తూ ఉంటే పూర్తి ఆరోగ్యంతో జీవించగలమని అనుకునేవారు. అయితే విటమిన్స్ స్వరూపాన్ని కనుగొన్నాక బి-విటమిన్ మరియు ఇందులోని మరికొన్ని విటమిన్స్ గూర్చి, వాటి ప్రాధాన్యత, వాటి అవసరం మొదలైనవి మెల్లిగా తెలుస్తూ వస్తున్నాయ్. అయితే చాలామంది ఆహారం మీద చూపించే శ్రద్ధ వాటిలోని విటమిన్స్ గూర్చి తెలుసుకోవడం మీద చూపడం లేదు. ఇపుడు బి-విటమిన్ జాబితా, మరియు వాటి గూర్చి వివరణ చదవాల్సిందే మరి.

బి-విటమిన్స్ జాబితా……

 విటమిన్ బి1(థయమిన్)

విటమిన్ బి2( రిబోఫ్లెవిన్)

విటమిన్ బి3( నియాసిన్)

విటమిన్ బి4( అడేనీస్)

విటమిన్ బి5(పాంతోతేనిక్)

విటమిన్ బి6( పైరిడాక్సైన్)

విటమిన్ బి7( బయోటిన్)

విటమిన్ బి8( adenosine)

విటమిన్ బి9 ( ఫోలిక్ ఆమ్లం)

విటమిన్ బి10 ( పారా అమినో బెంజోయిక్ యాసిడ్)

విటమిన్ బి12 ( కోబలమిన్స్)

అరుదైన బి కాంప్లెక్స్ విటమిన్: 

విటమిన్ బి11 : ఫోలిక్. ఆమ్లం యొక్క రూపమిది. పెరుదుదలను ప్రోత్సహించే విటమిన్.

ఇంకా ఈ విటమిన్-బి కాంప్లెక్స్ లు విటమిన్-22 వరకు ఉన్నాయి. అంటే 22 విటమిన్లు సమ్మేళనాన్ని విటమిన్-బి కాంప్లెక్స్ గా పేర్కొంటున్నారు.

విటమిన్-బి యొక్క ఉపయోగాలు

◆మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాల జీర్ణక్రియలో ఉపయోగపడే ఎంజైమ్ గా విటమిన్-బి పని చేస్తుంది. ఈ విటమిన్-బి ఆహారంలో లోపిస్తే ఆకలి మందగించడం, చేతులు కాళ్ళు మొద్దుబారడం, గుండెదడ, అలసట, నీరసం వంటి లక్షణాలు సంభవిస్తాయి.

◆బి విటమిన్లు జీవక్రియ రేటు పెరుగుదలకు తోడ్పడతాయి. ఆరోగ్యవంతమైన చర్మం, జుట్టు, మరియు కండరాల స్థాయి వృద్ధిచేయడానికి దోహాధం చేస్తాయి.

◆వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలోనూ నాడీవ్యవస్థను పటిష్టం చేయడంలో బి విటమిన్లు తోడ్పడతాయి.

◆రక్తహీనత నిరోధించడానికి సహాయపడే ఎర్రరక్త కణాల పెరుగుదలకు, మరియు వాటిని రక్షించడానికి బి విటమిన్ అవసరం అవుతుంది.

◆ప్రాణాంతకమైన క్లోమ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. అన్ని బి విటమిన్లు నీటిలో కరుగుతాయి, అంతేకాదు శరీరమంతటా వ్యాప్తి చెంది ఉంటాయి. 

◆బి విటమిన్లు కూడా దృష్టి లోటును తగ్గించడంలో తోడ్పడతాయి, దృష్టిలోపాన్ని తగ్గించి కంటి చూపు మెరుగుపరచడంలో విటమిన్ బి4 అవసరం అవుతుంది. 

బి- విటమిన్లు లోపించడం వల్ల వచ్చే వ్యాధులు:

ఆకలి మందగించడం, నోటి పూత, నోటి మూలల్లో పగలడం, రక్తహీనత, ఉద్వేగం, నాడీమండలంలో లోపాలు, తెల్లరక్త కణాల జీవితకాలం తగ్గిపోవడం, అతిసారం, రక్తహీనత, స్కర్వే, కాళ్ళు మండటం, కండరాల నొప్పులు, నాడీమండలంలో తేడాలు,  అలసట మొదలైన సమస్యలు వస్తాయి.

 చివరగా…..

విటమిన్-బి కాంప్లెక్స్ లు శరీరానికి చాలా అవసరమైనప్పటికి, అతిగా తీసుకోవడం వల్ల విషపూరితంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీటిని కావలసిన మోతాదులో గమనించుకుంటూ తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

Leave a Comment

error: Content is protected !!