చాలామందికి చాలా రకాల చర్మ సంబంధ సమస్యలు ఉన్న లేదా రేసస్ వలన దురదలు వస్తూ ఉంటాయి. కొంతమందికి చర్మం పై ఎటువంటి ఎలర్జీలు ఉండవు కానీ కాస్త ఒబేసిటీ వలన తొడల మధ్యలో, పిరుదల మధ్యలో,చంకలు మధ్యలో దురదలు వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి షేవింగ్ క్రీమ్ ఎలర్జీ వలన, హెయిర్ డై ఎలర్జీ వలన, కొన్ని రకాల మేకప్ సంబంధించిన కాస్మోటిక్స్ వలన, లొషన్స్ వలన దురదలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎగ్జీమ వలన అయిన, సోరియాసిస్ వల్ల దురదలు ఏమైనా ఉన్నా ఇంకా ఇన్ల్ఫమేషన్ వచ్చి దురదలు వచ్చిన, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వలన దురదలు వచ్చిన ఇలా ఏ రకమైన దురదలు ఉన్నాప్పటికి చక్కటి ఉపశమనం కలిగించే నేచురల్ ఆయిల్.
అదే క్యారెట్ ఆయిల్. ఈ క్యారెట్ ఆయిల్ ఖరీదు అయితే 10 ml ఆయిల్ 400 నుంచి 500 వరకు ఉంటుంది. ఇది చాలా ఖరీదు కానీ చాలా చక్కటి ఫలితాలు ఇస్తుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. ఇది ఏ రకమైన దురదను తగ్గించడానికి అయిన ఉపయోగపడుతుంది అని 2015 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ కోయంబ్రా పోర్చుగల్ దేశం గారు నిరూపించారు. వీళ్ళ పరిశోధన ప్రకారం ఇందులో ఏ రకమైన బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఇందులో ఉండే ఏ.బి.టి.ఎస్ అనే కెమికల్ కాంపౌండ్ వలన ఇది స్కిన్ లో ఉండే ఫ్రీ రాడికల్స్ ను స్పీడ్ గా గ్రహించి స్కిన్ లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి క్యారెట్ ఆయిల్ ఉపయోగపడుతుంది.
చాలామంది కెమికల్స్ తో కూడిన లొషన్స్ ని, ఆయింట్మెంట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమందికి దోమలు కుట్టిన చోట దొరద వచ్చి ఎలర్జీ చాలాసేపు ఉండిపోతుంది. దద్దుర్లు వచ్చి కొన్ని పడని వాటి వలన కూడా క్యారెట్ ఆయిల్ రెండు, మూడు చుక్కలు మాత్రమే ఇవి చాలా ఘాటుగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆరోమాటిక్ ఆయిల్స్. ఒకటి రెండు చుక్కలు తీసుకొని కాస్త పూస్తే చాలు చక్కగా దురదలు తగ్గడానికి వెంటనే ఉపశమనం అందిస్తుంది. కనుక న్యాచురల్ ఆయిల్ అయినా ఇటువంటి వాటిని ఉపయోగిస్తే శరీరానికి ఎటువంటి ఇరిటేషన్ రాదు, చక్కటి ఉపశమనం కలుగుతుంది.
ఇది శాశ్వత పరిష్కారం కాదు కానీ తాత్కాలిక ఉపశమనం అందిస్తుంది. శాశ్వత పరిష్కారం మన జీవన శైలి మార్చుకోవడం. తద్వారా దురదల నుంచి ఉపశమనం పొందవచ్చు…
ఈ కేరట్ ఆయిలు ఎలా పొందవ చో తెలపవలేను