Why do we Boil Milk During house Warming Ceremony

కొత్తగా కట్టుకున్న ఇంట్లో పాలు ఎవరితో పొంగించాలి?

సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి కల. అలాంటిది సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు అందరూ ప్రతి ఒక్కటి పద్ధతిగా చేయాలని కోరుకుంటారు. ఇంటికి శుభకరమైన మామిడితోరణాలు, మంత్రాలు, వాయిద్యాలు ఇంటిలో దిగే సమయంలో మూలల్లో వేసే ఉప్పు, ఆవుతో కొత్తింట్లో పేడ వేయించడం లాంటి ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు. ఇవి ప్రదేశానికి ప్రదేశానికి మధ్య మారుతూ ఉంటాయి కూడా.  అలాంటి పద్ధతుల్లో ఒకటి పాలు పొంగించడం కూడా. 

కొత్త ఇల్లు కట్టుకున్న లేదా అద్దె ఇంట్లో దిగేటప్పుడు అందరూ పాలు పొంగించి స్వీట్ చేస్తారు. దీనిని మొదట వినాయకుడికి నైవేద్యంగా పెడుతుంటారు. మామూలుగా పాలు పొంగింతే కంగారు పడే జనం దీనిని శుభంగా భావిస్తారు. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, లేదూ అద్దె ఇంట్లో దిగుతున్నప్పుడు పాలు పొంగించడానికి ఆడపడుచు లేదా వదిన ఉండాలి అంటారు. దానికి కారణం ఇల్లు కట్టుకున్నపుడు చేసే ఇలాంటి సంప్రదాయాలు వదినకి, ఆడపడుచుకి మధ్య సఖ్యత బాగుండాలని ఇలాంటి పద్థతులు పెట్టారు. 

అంతేకాకుండా పెళ్ళై వెళ్ళిపోయిన ప్రతి ఆడపిల్లకు పుట్టింట్లో ప్రధాన పాత్ర ఉందని తెలియజేయడానికి కూడా ఈ పద్థతులు ఉపయోగపడతాయి. కాకపోతే ఇలా కొత్తింట్లో లేదా అద్దె ఇంట్లో పాలు ఎందుకు పొంగిస్తారు అంటే పాల కడలిలో మహా విష్ణువు శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటారని నమ్మకం. ఇలా పాలు పొంగించడం వలన కొత్తగా ఇంట్లో దిగిన వారు ఇంట్లో  సిరి సంపదలు కొలువు అవుతాయని నమ్ముతారు.

పెద్దలు పెట్టిన ప్రతి సంప్రదాయం మూఢ విశ్వాసాలుగా భావించే ఈ తరం వారు అందులో పెద్దలు ఎన్ని కుటుంబ, సామాజిక విలువలను కూర్చారో అర్థంచేసుకుంటే ప్రతి సంప్రదాయం సంతోషకరమైన కుటుంబాలు, ఆరోగ్యకరమైన సామాజిక బంధాలు ఏర్పడటానికి దోహదపడతాయి.  అవేకాకుండా పిచ్చి నమ్మకాలని తీసిపారేసే చాలా విషయాలు కూడా సైన్స్ పరంగా నిరూపించబడినవే అని నమ్మాలి. ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా విషయం చెప్పినపుడు చులకన చేయకుండా దాని వెనుక ఉన్న కారణాలు అన్వేషించాలి.

Leave a Comment

error: Content is protected !!