ప్రస్తుత కాలంలో అందరిని తొందరగా చుట్టుముడుతున్న జబ్బులలో మధుమేహం ఒకటి. ఈ తీపి జబ్బు మనకు తియ్యదనాన్ని దూరం చేసి చేదును పరిచయం చేసి జీవితంలో ఒక రుచిని దూరం చేస్తుంది. అయితే ఇది రావడానికి అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. మరి విషయమేమిటో చదవండి.
నగరీకరణ, లేదా పట్టణీకరణ తరహా జీవితం షుగర్ వ్యాధి పెరగడానికి ముఖ్యకారణం అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మనకంటే ముందే నాగరికత సంపాదించుకున్న దేశాలకన్నా, ఇప్పుడిపుడే అభివృద్ధి సాధిస్తున్న మన దేశంలో నాగరికత శరీర ఆరోగ్య దృష్ట్యా వ్యతిరేక ఫలాలను ఎందుకిస్తోందని శోధిస్తే అందరికి కనబడుతున్న ముఖ్య కారణం జెనిటిక్స్. అంటే మన దేశంలో ప్రజలకు మధుమేహం ఎక్కువగా రావడానికి కారణం జన్యుపరమైనవే అని స్పష్టం చేస్తున్నారు.
వంశపారంపర్యంగా మధుమేహం సంక్రమించే అవకాశాలు ఎక్కువని, నాగరికత సంతరించుకునే కొద్దీ వృద్ధాప్యానికి దగ్గరయ్యే వయసులో రావలసిన మధుమేహం, లేత వయసులోనే రావడం మొదలైన ప్రస్తుత కాలంలో కొన్ని పరిశీలిస్తే.
ఆధునిక దేశం అయిన అమెరికా లాంటి దేశంలో మధుమేహం కు గురి అవుతున్న వ్యక్తి సగటు వయసు 59 సంవత్సరాలు అయితే మన దేశంలో అది 43 సంవత్సరాలుగా ఉంది. దీనికి కారణాలు ఏమిటని పరిశీలించుకుంటే మన భారతీయులు మన ఉష్ణోగ్రత, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీసుకుంటున్న మన వారసత్వ ఆహారాలను వదిలి పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల అవి శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలను ఉత్పన్నం చేస్తున్నాయి.
ప్రపంచంలో ప్రతి ప్రాంతంలోనూ తమకంటూ కొన్ని ఆహారపు అలవాట్లు ఉంటాయి. వాటి వెనుక కారణం ఆ ఆహార పదార్థాలు తమ శరీరానికి మరియు తాము నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత, వాతావరణం ను భరించగాలిగేలా శరీరానికి శక్తిని ఇవ్వడానికి నిర్దేశించుకుంటూ వస్తున్న ఆహారమది. అయితే విదేశీ రుచులు మరియు అలవాట్ల వ్యామోహంలో మనదైన అలవాట్లను తొక్కిపెట్టి కొత్తవాటికి అలవాటు పడటం వల్ల అది మన ప్రాంతీయతకు మన శరీర తత్వాలకు సరిపడకపోగా ఆ పదార్థాలను దీర్ఘకాలికంగా తీసుకోవడం వలన శరీరంలో చక్కర స్థాయిలు పెరిగిపోయి మధుమేహానికి దారి తీస్తున్నాయి.
ప్రతుతం 40 సంవత్సరాల వయసులోకి అడుగు పెట్టడం తోనే, షుగర్,బిపి వంటి వాటికి దగ్గరవుతున్నామని గుర్తుంచుకొని ముందస్తు జగ్రత్తలు తీసుకోవాలి. స్థూలకాయం ను దరిచేరనివ్వకుండా శరీరానికి తగిన వ్యాయామం, మన దేశ సంస్కృతిలో భాగమైన యోగ, ధ్యానం వంటివి పాటించాలి. సాధారణంగా లావు అనేది కూడా కొందరికి జన్యుపరంగా వస్తూ ఉంటుంది అలాంటివాళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
మానసిక ప్రశాంతతని అలవరుచుకోవడం, చిన్న విషయాన్ని భూతద్దంలో నుండి చూస్తూ పెద్దగా ఊహించుకుని మానసిక ఆందోళనలు, టెన్షన్ లు, దిగుళ్ళు పెంచుకునే మనస్తత్వాన్ని వదిలేసి వాటిని దూరం చేసుకోవడానికి యోగ- ధ్యానం వంటివి రోజులో భాగం చేసుకోవడం ఉత్తమం.
చివరగా……..
మధుమేహం అనేది మన దేశ పౌరులకు వచ్చిన కారణం కేవలం జీవనశైలి మారడం వల్లనే అని విషయాన్ని గ్రహించి మన శరీరానికి దేశ వాతావరణ పరిస్థితులకు తగ్గ ఆహారాన్ని అలవాట్లను పాటించడం ద్వారా మధుమేహాన్ని మన నుండి తరిమికొట్టవచ్చు.
Nice information