why honey is better than sugar

చక్కెర కంటే తేనె ఎందుకు మంచిది

గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ల సమ్మేళనమే సుక్రోజ్ అని దీన్నే చక్కెర గా పిలుస్తామని చాలా మంది అభిప్రాయపడిపోతారు. అయితే చెరకు రసం నుండి తెల్లని స్పటికాలు గల చెక్కరకు తయారు చేసే విధానంలో రసాయనాలు కలపడం జరుగుతుంది. ముఖ్యంగా చక్కెర తయారు చేసేటపుడు సల్ఫర్ ను వాడతారు.  సల్పర్ కు కరిగే గుణం తక్కువ. చక్కెర ను ప్రతిరోజు మనం తీసుకోవడం వల్ల అది రక్తంలో చేరిపోతుంది. ఈ కరగని సల్ఫేర్ స్థాయిలు కూడా ప్రతి రోజు ఎక్కువైపోతూ ఉంటాయి.  ఎప్పుడైతే ఈ రక్తలోని సల్ఫర్ స్థాయి అధికమైపోతుందో అపుడు మధుమేహం వచ్చేసిందని వైద్యులు దృవీకరిస్తారు. అయితే ఇపుడిపుడు ఆరోగ్యం మీద అవగాహన వస్తున్న వారు చక్కెర కు ప్రత్యామ్నాయంగా తేనె ను ఎంచుకుంటున్నారు. 

చక్కెర ను వదిలి తేనేకు ఓటు వేయడంలో దాగున్న విషయం ఏంటో ఒకసారి చూద్దాం రండి.

◆  తేనె ఆరోగ్యప్రదాయిని అంటారు. తేనెలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయనేది వాస్తవం. స్వచ్ఛమైన తేనె ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల చక్కెర బదులు తేనె తీసుకోవడం వల్ల మంచి రుచి మాత్రమే కాకుండా గొప్ప ఆరోగ్యం కూడా చేకూరుతుంది. 

◆ ఇది ద్రవపదార్థం అనే విషయం అందరికీ తెల్సినదే.  అయితే తేనెలో 14 నుండి 18% వరకు తేమగా ఉంటుంది. దీని చిక్కదనంలో ఉన్న కాసింత తేమ సహజమైనది కావడం వల్ల పాడవడం జరగదు.

◆చక్కెర వాడినపుడు అది ఎంత వేగంగా కరుగుతుందో అది శరీరంలో కలిసిపోయాక జీర్ణమవడానికి చాలా సమయం తీసుకుంటుంది. అందుకే చక్కెర వల్ల స్థూలకాయం ఏర్పడుతుంది. కానీ తేనె మాత్రం చాలా తొందరగా జీర్ణమవుతుంది

◆తేనె చాలా తేలికగా ఉంటుంది. అందువల్ల  తొందరగా మరియు సులువుగా జీర్ణమైపోతుంది. మనం తీసుకునే అన్ని ఆహార పదార్థాల కంటే తొందరగా రక్తంలో కలిసిపోయి వివిధ శరీర భాగాలకు తక్షణ శక్తిని ఇస్తుంది. అందుకే నీరసంగా ఉన్నపుడు నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లను తీసుకోమని పెద్దలు చెబుతుంటారు.

◆చక్కెర తీసుకున్నపుడు అది ఉత్తేజాన్ని ఇచ్చినట్టు అనిపించినా కొద్దిసేపటి తరువాత వ్యతిరేకంగా పనిచేస్తుంది. తొందరగా నీరసాన్ని చేకూరుస్తుంది చక్కెర ఒక డ్రగ్స్ లాగా ఎడిక్ట్ చేస్తుంది. దానికి అలవాటు పడితే తరువాత మానేయలనుకున్నా కష్టమే. అయితే ఈ విషయంలో  మధుమేహ  సమస్య ఉన్నవారిని స్ఫూర్తిగా తీసుకుని చక్కెర మానేయడం పట్ల దృష్టి సారించాలి.

◆మన శరీరంలో  మూత్రపిండాలను మరియు మూత్ర విసర్జక వ్యవస్థను దెబ్బతీయడంలో సల్ఫర్ పనిచేస్తుంది. అందుకే సల్పర్ కు మూలమైన  చక్కెరకు దూరంగా ఉండటం వల్ల  వీటిని సంరక్షించుకోవచ్చు.

◆తేనె మరియు చక్కెరల్లో ఉన్న క్యాలరీల పరంగా చూస్తే చక్కెరల్లో కంటే తేనెలో క్యాలరీలు తక్కువ మరియు ఇవి ఆరోగ్యకరమైనవి అని చెప్పవచ్చు.

చివరగా…..

తేనె ఒక సహజమైన తీపి పదార్థం కాబట్టి ఎలాంటి అనారోగ్యాన్ని కలుగజేయదు అయితే తేనెను కూడా కల్తీ చేసి అమ్ముతున్న నేటి కాలంలో ఉత్తమమైన తేనెను ఎంపిక చేసుకుని వాడటం వల్ల ఆరోగ్యాన్ని పధికాలాలపాటు పదిలంగా వుంచుకోవచ్చని వేరే చెప్పాలా.

Leave a Comment

error: Content is protected !!