Why Is Maida Bad For You Side Effects Of Maida

గోధుమపిండి ఎక్కువగా వాడుతున్నారా?? ఒకసారి ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు.

 మనం తీసుకుంటున్న ఆహారంలో శరీరానికి సరిపడని పదార్థాలు ఉంటాయి. కానీ అవగాహన లేకపోవడం వల్లనో లేదా తినాలనే ఇష్టం వల్లనో తినేస్తుంటాం. అలాంటి పదార్థాలలో గోధుమ పిండి కూడా ఒకటి అంటే ఆశ్చర్యమేస్తుంది కానీ అది నిజం. ముఖ్యంగా గోధుమ పిండిలో ఉండే గ్లూటెన్ అనే ప్రోటీన్ పదార్థం కొంతమందికి సరిపడకపోవడం వలన సీలియాక్ అనే వ్యాధి వస్తుంది. దగ్గు, జలుబు, ఉబ్బసం లాంటి అలర్జీ వల్ల వచ్చేవి ఎలాగో సీలియాక్ కూడా గోధుమపిండి వంటకపోవడం వల్ల వస్తుంది

        సాధారణంగా చాలా మంది డైటింగ్ పేరుతో ఈమధ్యన రాత్రిళ్ళు అన్నం మానేసి చపాతీలు, మసాలా కూరలతో తినడం మొదలు పెట్టారు. కారణం గోధుమ పిండిలో ఫైబర్ అధికంగా ఉంటుందనేది అందరి అభిప్రాయం. అయితే అందరూ ఇక్కడే అపోహ పడుతున్నారనేది తెల్సుకోరు. ఒక్కపుడు దొరుకుతున్న ముడిగోధుమలను మనం నేరుగా పిండి పట్టించి వాడుకునేవాళ్ళం. దీనివల్ల అందులో ఫైబర్ శాతం బాగానే ఉండేది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్న గోదాపిండిని చాలావరకు ఫ్యూరీఫై పేరుతో శుద్దిచేయడం వల్ల అందులో ఫైబర్ శాతం చాలా తక్కువ, గ్లూటెన్ శాతం ఎక్కువ ఉంటుంది.

    మనం తినే అన్నంలో  కంటే కూడా ఈ గోధుమ తో చేసుకునే రోటీలలోనే ఎక్కువ కేలరీలు ఉంటాయనేది నిరూపితమైన వాస్తవం. ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే షుగర్ సమస్య కూడా చపాతీ ఎక్కువ తినడం వల్ల వస్తుందని వింటే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇదే వాస్తవం. 

గోధుమపిండి సరిపడకపోతేకనిపించే లక్షణాలు ఇవే: 

◆రక్తహీనత, నీరసం, నిస్సత్తువ

◆దుర్వాసనతో కూడిన నీళ్ల విరేచనాలు

◆కడుపునొప్పి కడుపులో పేగులు కాండదలు బిగుసుపోయినట్టు అనిపించడం

◆పొట్ట ఉబ్బరం, పిల్లటి త్రేన్పులు, గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటుంది

◆తరచూ నోటిపూత కలగడం

◆తీపి పదార్థాలు తిన్నపుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది

◆పేగులలో వాపు లాంటి సమస్యలు ఏర్పడం వల్ల పైవన్నీ జరుగుతాయి. ఈ సమస్య ఎక్కువ కాలం ఇలా కొనసాగితే  చిన్న పేగు కాన్సర్ కు దారి తీస్తుంది.

◆పేగు పూత, పేగుల్లో అవరోధాలు ఏర్పడతాయి. 

◆ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు వంటబట్టకపోవడం వల్ల మనుషులు చాలా తగ్గిపోతారు

◆ఐరన్, బి12 ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే వ్యాధులన్నీ చుట్టుముడతాయి.

◆విటమిన్ కె లోపం ఏర్పడటం వల్ల రక్తస్రావాన్ని అరికట్టే వ్యవస్థ దెబ్బతింటుంది.

◆మహిళల్లో గర్భస్రావాలు, నెలసరిలో అధిక ఋతు రక్తం పోవడం, దీర్ఘకాల ఋతురక్తం పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

చివరగా….

పైన చెప్పుకున్నవాటిలో మీకు ఈ సమస్యలు ఎదురవుతున్నట్టు అయితే గోధుమపిండి తినడంలో మీరు జాగ్రత్త వహించాల్సిందే మరి. ఆలోచించండి!!

1 thought on “గోధుమపిండి ఎక్కువగా వాడుతున్నారా?? ఒకసారి ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు.”

Leave a Comment

error: Content is protected !!