why should we drink warm water in empty stomach

పొద్దున్నే ఖాళీ కడుపుతో గ్లాస్ వేడి నీటిని త్రాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే అస్సలు వదలరు

ఉదయం లేచిన దగ్గర్నుంచి మన శరీరం ఎన్నో పనులను నిర్వహిస్తూ ఉంటుంది. ఇందులో 90 శాతం పనులు గురించి మనకు తెలియని కూడా తెలియదు ఎందుకంటే ఇవి మన శరీరం లోపల జరిగే ప్రక్రియలు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం శరీరంలో రక్తాన్ని తయారు చేయడం అలాగే శరీరంలో ఉన్న విష వ్యర్థ పదార్థాలను బయటకు తీయడం లాంటివి. ఇలాంటి ప్రక్రియలు దాదాపుగా ప్రతి క్షణం మన శరీరంలో నడుస్తూనే ఉంటాయి. మనం నిద్రిస్తూ ఉండేటప్పుడు కూడా మన శరీరం లోపలి నుండి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రక్రియలన్నీ జరగడానికి నీళ్ల అవసరం కూడా అంతే ఉంటుంది. ఎలాగైతే కారు నడపడానికి పెట్రోల్ అవసరం ఉంటుందో ఆ విధంగా అన్నమాట. ఎందుకంటే మన శరీరం 65% నీటితో తయారు చేయబడి ఉంటుంది. మనిషి యొక్క చిన్న పెద్ద అన్ని శరీర అవయవాలు నీటితో కలిసి తయారుచేయబడి ఉంటాయి. ఇందువల్లనే  శరీరంలో నీటి శాతం ఉండటం సరిగ్గా ఎంతో అవసరం. ఇది లేకుంటే మన శరీరం యొక్క భాగాలు లోపల జరిగే శరీర ప్రక్రియలు ఇంజన్ లేని కారుతో సమానం అవుతాయి. సో మీకు ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మన శరీరానికి  నీరు మనకు ఎంత అవసరమో.

మనకు అధిక శాతం వ్యాధులు మన అజాగ్రత్త వలన అజ్ఞానం వలన గాడి తప్పిన లైఫ్ స్టైల్ వలన వస్తాయి. కానీ మన దైనందిన జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వలన మనల్ని మనం ఎన్నో వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. మనం నీళ్లు తాగడం అనేది చాలా సాధారణ విషయం కానీ రోజు రెండు నుంచి మూడుసార్లు వేడినీటిని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల బారి నుండి కాపాడుకోవచ్చు.

ఉదయాన్నే వేడి నీరు త్రాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నీటిని వేడి చేయడం వల్ల ఇందులో ఉన్న అశుద్ధం మరియు హానికారక సూక్ష్మక్రిములు అన్ని నాశనం అవుతాయి. అలాగే ఈ నీళ్లు మినరల్ వాటర్ కంటే చాలా స్వచ్ఛంగా ఉంటాయి. ఎందుకంటె  వాటర్ ప్యూరిఫైయర్ అనేది వాటర్ లోపల ఉండే కొన్ని అవసరమైన మినరల్స్ ను కూడా నాశనం చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇందువల్లనే మనం సాధ్యమైనంత ఎక్కువగా ఇంట్లో ఉన్న శుభ్రమైన నీటిని గోరువెచ్చగా చేసుకుని వాడాలి.

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే లేదా  రాత్రి పడుకునే ఒక గంట ముందు గోరు వెచ్చని నీటిని సేవించడం వలన మన బాడీని డిటాక్సిఫై (శరీరంలోని విష పదార్థాలను బయటకు తీయడం) చేస్తుంది. వేడి నీరు త్రాగడం వల్ల శరీరం శుద్ధి అవుతుంది. వేడి నీరు తాగిన వెంటనే మన శరీర ఉష్ణోగ్రత పెరిగి చిరు చెమటలు పడతాయి. అలా చెమట పట్టడం ద్వారా శరీరంలో ఉన్న మలినాలు బయటికి వెళ్లిపోయి శరీరం శుద్ధి అవుతుంది.

అదేవిధంగా మీరు ఉదయాన్నే వేడి నీటిలో నిమ్మరసం కూడా కలుపుకుని తాగవచ్చు. వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వలన మన శరీరానికి విటమిన్ సి లభిస్తుంది. అలాగే మన శరీరం లోని ఇమ్యూనిటీని బలంగా తయారు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వలన మన శరీరంలో మెటబాలిజం వేగవంతమవుతుంది దీని వల్ల మన శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వు సైతం త్వరగా కరిగిపోతుంది. కావున మీరు ఎప్పుడైనా బరువు త్వరగా తగ్గాలని ఆలోచిస్తే అన్నింటికంటే ముందు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు గ్లాసుల వేడినీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి. దీనివల్ల మూడు నెలల్లో మీ శరీరంలో మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే వేడి నీళ్లు మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును కరిగిస్తాయి.

జీర్ణ వ్యవస్థను మెరుగు పరచుకోవడం కోసం

ఆయుర్వేదం ప్రకారం ఎక్కువ శాతం వ్యాధులు కడుపులో నుండి మొదలవుతాయి ఇందుకోసం కడుపును జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో అవసరం. అలాగే కొంత మంది శరీరంలో ఏం తిన్నా తాగిన మంచిగా అనిపించదు. అలాగే వారు తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు.  దీనికి ముఖ్య కారణం జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం. కావున ఇలాంటి వారు  ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రం అవుతాయి. దీని వల్ల వారి శరీరంలోని జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది మరియు  తిన్నఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే గ్యాస్ ఉబ్బరం వంటి సమస్యలు నుండి ఉపశమనం లభిస్తుంది.

మలబద్దక సమస్యకు చక్కటి పరిష్కారం

మనలో ఎక్కువ శాతం మందికి కడుపు ఉదయాన్ని ఫ్రీగా ఖాళీ అవదు అంటే మోషన్ ఫ్రీగా అవ్వదు. దీనికి కారణం మలబద్ధకం. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల మలబద్దకం అనేది త్వరగా తగ్గిపోతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీటిని సేవించడం మర్చిపోకండి.

వెంట్రుకలకు చాలా ఉపయోగకరం

వేడినీళ్లు మన జుట్టు ఎదుగుదలను  ఇంప్రూవ్ చేస్తాయి దీనివల్ల వెంట్రుకలు బాగా పెరుగుతాయి మరియు తక్కువగా రాలుతాయి. ప్రతిరోజు వేడి నీటిని సేవించినట్లు అయితే మన తలలో సేల్స్ కు ఒక టానిక్ లా పనిచేస్తుంది. దీని వల్ల తల పొడిబారడం లేదా డాండ్రఫ్ వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది అలాగే వెంట్రుకలు కూడా పెరుగుతాయి. ఒకవేళ మీకు  వెంట్రుకలు రాలిపోవడం చిట్లిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఉదయాన్నే వేడి నీటిని ఖాళీ కడుపుతో తాగడం ప్రారంభించండి మెల్ల మెల్లగా మీ వెంట్రుకల సమస్యలు దూరమవుతాయి.

రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూడటం

మన శరీరం అన్నివిధాలా సక్రమంగా నడవడానికి రక్త ప్రసరణ మొత్తం బాడీ లో సరైన ఈ విధంగా జరగడం ఎంతో అవసరం దీనికోసం వేడి నీళ్ళు త్రాగడం ఎంతో ఉపయోగకరం. కావున ఎవరికైతే రక్తం తక్కువగా ఉండి బ్లడ్ సర్క్యులేషన్ సమస్య ఉంటుందో అలాంటివారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లను సేవించడం ప్రారంభించాలి.

చర్మానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది

వేడి నీళ్లు తాగడం వలన మీ కాస్మోటిక్స్ ఖర్చులు తగ్గిపోతాయి ఎందుకంటే ఇది ఈ చర్మం యొక్క మెరుపును మెయింటెన్ చేస్తుంది. ఇది మన శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. దీని వల్ల మన చర్మం మెరుస్తుంది నీళ్లు చర్మం కోసం ఎంతో మంచిది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు సేవించినట్లు అయితే ఇది మీ శరీరం యొక్క అన్ని చర్మరోగాలకు మెడిసన్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు కూడా చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లను సేవించడం అలవాటు చేసుకోండి.

వేడి నీళ్ళు యాంటీఏజింగ్ లాగా పనిచేస్తాయి

మీ ముసలితనము లేటుగా వస్తుంది. మీరు యవ్వనంగా కనిపించేలా ఉండాలనుకుంటే ఈ రోజు రెండు నుంచి మూడు గ్లాసుల వేడి నీటిని త్రాగడం మరచిపోకండి. ఎందుకంటే ఇది మీ శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు తీసి మీ స్కిన్ ను  రిపేర్ చేస్తుంది. దీని వల్ల మీ చర్మం బిగుతుగా మారుతుంది. మీ చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి

జలుబుని నివారిస్తుంది.

ఒకవేళ మీకు జలుబు  ఉన్నా జ్వరం ఉన్నా లేదా గొంతులో గరగరగా ఉన్నా వేడి నీటిని సేవించినట్లైతే  అయితే మీరు ఈ వ్యాధుల నుంచి త్వరగా కోలుకో వచ్చు.

Leave a Comment

error: Content is protected !!