why we should do head bath and best way to to do head bath

తలస్నానం గురించి షాకింగ్ నిజాలు!! ఇన్నిరోజులు మనం చేస్తున్నది తప్పా?? అందుకే ఇన్ని జబ్బులు వస్తున్నాయా??

తలమీద నీళ్ళు పోసుకొని స్నానం చేయడాన్ని తలంటుకోవడం, అనో, తలంటి పోసుకోవడం అనో మనం అంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే కుంకుడు కాయతో గానీ, షాంపుతో గానీ, శీకాయతో గానీ తలారా స్నానం చేయడాన్ని తలంటి పోసుకోవడం అని మనం వ్యవహరిస్తున్నాం.

కానీ తలంటుకోవడం అంటే ఏమిటో తెలుసా?? తలని నూనెతో అంటాలి! మాడు మీద నూనె పోసి బాగా మర్దన చేయడాన్ని ‘తలంటడం’ అంటారు. నిజంగా మనం ‘తలంటి’ పోసుకొంటున్నప్పుడు ఇలా నూనెతో తలంటుకుంటున్నామా? చాలా మంది తలంటుకోకుండానే ‘తలంటి’ పోసుకుంటున్నారన్నది వాస్తవం! 

నలుగు పెట్టుకుంటే మలినాలు పోతాయి!

నూనెతో తలని అంటి, స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు. ఇదే నిజమైన ఆయిల్ బాత్! నూనెని తలతోపాటు వొళ్ళంతా పట్టించుకొని, బాగా మర్దన చేయించుకొని నలుగుపెట్టుకుని, అది ఆరాక వలిచి, అప్పుడు స్నానం చెయ్యాలి.. నలుగు పెట్టుకుంటే వొళ్ళు తగ్గుతుంది. జిడ్డు పోతుంది. శరీరకాంతి పెరుగుతుంది. కనీసం వారానికి ఒకసారయినా ఇలా అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం పదిలంగా వుంటుంది. రోజూ అయితే ఇంక తిరుగేముంది!

మెదడు వ్యాధులన్నింటికి పరిష్కారం ఆముదంతో తలంటు!

ఆముదాన్ని తలకి, ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే షుగర్ వ్యాధి, పక్షవాత వ్యాధి, నడుంనొప్పి, కీళ్ళవాతం, మైగ్రేన్ తలనొప్పి మొదలైన వ్యాధులన్నింటిన్నిటి నుండి ఉపశమనం ఉంటుంది.  వేడి తగ్గిస్తుంది. మెదడుకు సంబంధించిన జబ్బులన్నింటిలోనూ ఆముదం అంటి తలంటి పోయడం ఉత్తమ మార్గం.!

స్నానానికి ముందు కొబ్బరినూనె పట్టించుకోవడం వల్ల  చర్మం కాంతి వంతంగా ఉంటుంది. కొబ్బరినూనెతో గాని, నువ్వులనూనెతో గానీ, అభ్యంగన స్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయి. సుఖంగా నిద్రపడ్తుంది. శరీరం తేలికగా వుంటుంది. పిచ్చి కలలు రావడం తగ్గుతుంది. తలంటి పోసుకునేప్పుడే కాదు – మామూలు స్నానం చేసేటప్పుడు కూడా తైలమర్దనం మంచిదే.

 నెయ్యితో తలంటితే తెలివితేటలు పెరుగుతాయి!!

 నెయ్యితో తలంటుకొంటే కంటి వ్యాధుల్లో అమోఘమైన ఫలితం కన్పిస్తుంది. అమితమైన చలవని కల్గిస్తుంది. మూత్రవ్యాధులన్నింటికీ ఇది చాలా మంచిది. ఆయుష్షును పెంచుతుంది. శరీరం మంచి కాంతినిస్తుంది. రోగపీడితులలాగా నిస్సత్తువగా కనిపించే వ్యక్తుల్లో తేజస్సు పెరుగుతుంది. పిల్లలకు నేతి తలంటి పోస్తే తెలివితేటలు పెరుగుతాయి ఆకలి పెరుగుతుంది. వారి సహజ శక్తులు అన్నీ రెట్టింపు ఔతాయి. రక్తహీనత, కామెర్లు, అమీబియాసిస్, దగ్గు, జలుబు, ఆయాసం, ఉబ్బసం వ్యాధులన్నింటిలోను ఇది మేలుచేస్తుంది.

 మానసిక వ్యాధులకు మంచిగంధం వంటికి పట్టించాలి!

మంచి గంధపు చెక్కని అరగదీసి, అందులో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వంటి పరిమళ ద్రవ్యాల్ని కలిపి శరీరానికి పట్టించుకొంటే దాన్నే “చందన చర్చ” అంటారు! “మైపూత” అంటే ఇదే. కావ్యాల్లో కావ్యనాయికలు ఇలా లేపనాన్ని వేసుకొన్నట్లు కవులు వర్ణిస్తారు. మనం వీటిని మరిచిపోయాం! ఇదీ ఒక చర్మ సౌందర్య రహస్యమే. ఆడవారేకాదు – మగవారికీ ఇది అవసరమే! మరీ ఖరీదైనదేమీ కాదు. తేజస్సుని, బలాన్ని, వృద్ధి చేస్తుంది. చెమట దుర్వాసనని పోగొడ్తుంది. మూర్ఛవ్యాధికి మంచిది. మానసిక వ్యాధుల్లో మనసుకు ఉల్లాసాన్ని కల్గిస్తుంది. తాపాన్ని పోగొడ్తుంది. 

తలంటి పోసుకోకూడని సమయాలు!

విరేచనాలౌతున్నప్పుడు తలంటి పోసుకోకూడదు. కడుపునొప్పి, జిగురురక్తంతో, విరేచనాలౌతూ కడుపులో పరిస్థితి బాగోలేదనుకున్నప్పుడు తలంటి పోసుకోకూడదు. ఆ సమయంలో షాంపూతో స్నానం కూడా నిషిద్దమే. ఒంటిమీద గాయాలున్నవారు, జ్వరంతో వున్నవారు. క్షయవ్యాధితో బాధపడ్తున్నవారు, దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడ్తున్నవారు తలంటిపోసుకోకుండా వుంటే మంచిది. ఆ పరిస్థితులు నెమ్మదించాక తలంటి పోసుకోవచ్చు. అర్ధరాత్రిపూట, సూర్యాస్తమయం సమయాలలోను, టిఫిన్ చేసిన తర్వాత, అన్నం తిన్న తర్వాత తలంటి పోసుకోకూడదు. తక్కిన అన్ని రోజులలోనూ, అన్ని సమయాలల్లోనూ తలంటి మంచిదే. 

చివరగా…

పండుగరోజునే తలంటి పోసుకోవాలనే నియమం లేదు. సృష్టిలో ప్రతిరోజూ శుభకరమైనదే.

Leave a Comment

error: Content is protected !!