why we should not waste rice indian culture

రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఒక్క తప్పు చేయకండి. మహా పాపం

మనదేశంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. అలాంటి అన్నం తినేటప్పుడు చేయకూడని కొన్ని తప్పులు గురించి చెప్పుకుందాం. అలాగే ప్రాచుర్యంలో ఉన్న ఒక కథ గురించి కూడా తెలుసుకుందాం.ఒక ఊరిలో అన్నం తినే సమయానికి ఒక ఇంటికి ముగ్గురు సాధువులు దూర ప్రదేశాలనుండి వచ్చారు. వారిని చూసిన ఆ ఇంటి కోడలు వారిని “లోపలికి రండి మా వారు లేరు మీకు భోజనం వడ్డిస్తాను” అంది. దానికి వారు “పురుషులు లేని ఇంట్లోకి మేము రాకూడదు. మీ ఆయన వచ్చిన తర్వాత వస్తామంటూ” బయట కూర్చున్నారు. కొంతసేపటికి ఆమె భర్త ఇంటికి వచ్చాడు. 

ఆమె “ఇప్పుడు మా ఆయన వచ్చాడు. భోజనానికి లోపలికి రండి అని పిలవడంతో వారు మేము ముగ్గురం ప్రేమ, విజయం, ఐశ్వర్యం అనే పేర్లు కలవాళ్ళం.  మీరు ఒకరిని మాత్రమే లోపలికి పిలవాలి. మిగతా వాళ్ళం బయటే ఉంటామని” చెప్పారు. అయితే ఆమె వచ్చింది దేవతలని గమనించి లోపలికి వెళ్లి తన భర్తతో “ఎవరిని పిలవాలి” అని అడిగింది. ఆమె భర్త “గెలుపుని పిలుద్దాం”  అని అన్నాడు. దానికి అతడి తల్లి “గెలుపు ఉంటే సరిపోదు కదా ఐశ్వర్యం కూడా ఉండాలి. ఐశ్వర్యంని పిలుద్దాం” చెప్పింది.

 అయితే కోడలు “గెలుపు, ఐశ్వర్యం ఉన్నచోట ప్రేమ లేకపోతే ఏమీ చేయలేం. కానీ  భార్య భర్తల మధ్య, ఇంటి కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమ ఉంటే అంతా ఆనందమయం. ప్రేమ లేకుండా విజయం, ఐశ్వర్యం ఉన్న వారి జీవితం నిరర్ధకం. అందుకే మనం ప్రేమను పిలుద్దాం” అంది. ఆమె మాటలు సబబుగా అనిపించి వాళ్లు సరేనన్నారు. ఆమె భర్త బయటకు వెళ్లి “ఇక్కడ ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు” అని పిలిచాడు. ప్రేమతో పాటు విజయం, ఐశ్వర్యం కూడా లోపలికి వచ్చారు. అది చూసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు.

 అప్పుడు వారు “ప్రేమ ఎక్కడ ఉంటుందో విజయం, ఐశ్వర్యం కూడా వారిని వరిస్తుంది” అని వారిని ఆశీర్వదించారు. అన్నపూర్ణాదేవి ఆహారానికి అధిదేవతగా భావిస్తాం. అన్నపూర్ణాదేవి రాత్రిపూట తిన్న గిన్నెలు కడగకుండా వదిలేసే  వారి ఇంట్లో ఉండదు. అలాగే అన్నం తినేటప్పుడు ఒకచోట కూర్చుని మాత్రమే తినాలి. అటు ఇటు తిరుగకూడదు. కంచం చుట్టూ మెతుకులు వేయకూడదు. అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించే అన్నాన్ని ముట్టుకునే ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. తిన్న గిన్నెను వెంటనే కడిగేయాలి లేదా కొద్దిగా నీటిని వేసి పక్కన పెట్టాలి. ఆహారాన్ని వ్యర్థం చేయకూడదు. ఆకలి అన్నవారికి ఆహారాన్ని అందివ్వాలి. ఇవన్నీ పాటించేవారి ఇంట్లో ప్రేమ, విజయం, ఐశ్వర్యం కూడా ఉంటాయి.

Leave a Comment

error: Content is protected !!