Why You Should Think Twice About Eating Cashews

జీడిపప్పు అధికంగా తినేవారికి షాకింగ్ నిజాలు!!

ఏ తీపి వంటకం చేసినా అందులో జీడిపప్పు వేయడం తప్పనిసరిగా ఉంటుంది. దోరగా వేయించిన జీడిపప్పుకు కాసింత ఉప్పు చల్లి కాసింత ఆర్థికంగా ఉన్నవారు స్నాక్స్ గా తింటుంటారు. అలాగే జీడిపప్పుతో కాజు కట్లీఅంటూ, ఇంకా జీడిపప్పును వంటల్లో కూడా అదనపు రుచి కోసం పేస్ట్ గా చేసి వేయడం, జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు బిర్యాని, జీడిపప్పు పనీర్ ఇలా తీపి వంటలను మించి బోలెడు వంటకాలు కూడా జీడిపప్పుతో నోరు ఊరిస్తాయ్. అయితే చాలామంది రుచికి మరిగి జీడిపప్పు ఎక్కువ తినేస్తారు. జీడిపప్పు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా అని ఆలోచిస్తే ఇదిగో జీడిపప్పు ఎక్కువ తినడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు.

 బరువు పెంచుతుంది

 జీడిపప్పును మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయితే అధిక పరిమాణంలో తీసుకుంటే మాత్రం ఇందులోని అధిక కేలరీల వల్ల బరువు చాలా తొందరగా పెరుగుతారు. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు ను కలిగి ఉండటం వల్ల వీటిని మితంగా తీసుకుంటె హృదయనాళ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి కాని అధిక పరిమాణంలో తినేటప్పుడు ఈ  పోషకమైన కొవ్వులు ఎక్కువై అవి అనారోగ్యానికి దారితీస్తాయి. చూడండి

  సోడియం ఎక్కువగా అందుతుంది

 జీడిపప్పులో సోడియం స్థాయి తక్కువగానే ఉన్నప్పటికీ అధిక మొత్తంలో జీడిపప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఇది రక్తపోటును అనూహ్యంగా పెంచే స్వభావాన్ని కలిగి ఉంటుంది  దీనివల్ల గుండె సంబంధ సమస్యలు తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే హృదయనాళ సమస్యలకు దారితీస్తుంది. మరొక విషయం ఏమిటంటే జీడిపప్పుని వేయించి ఉప్పు చల్లుకుని గినడం వల్ల ఈ సమస్య మరింత ప్రమాధకరమైనదిగా మారుతుంది.

 ముడి జీడిపప్పు ప్రమాదకరమైనవి

 చాలామంది తక్కువ ధరకు లభిస్తున్నాయని ముడి జీడిపప్పు కొనుగోలు చేస్తుంటారు. జీడీ కాయల నుండి జీడిపప్పు తయారీ ప్రాసెస్ లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ముడి జీడిపప్పు చాలా సార్లు అలర్జీ, దురద, జీర్ణాశయ సంబంధ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఉత్తమమైన నాణ్యత కలిగిన జీడిపప్పుని ఎంచుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.

 సమతుల ఆహార వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. 

 జీడిపప్పులో పెద్ద సంఖ్యలో పోషకాలు ఉన్నప్పటికీ, అవి మనం తీసుకునే ఇతర ఆహారాల మీద ప్రభావం చూపిస్తుంది. జీడిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల తొందరగా జీర్ణం అవకుండా ఆకలిని దూరం ఉంచుతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన పండ్లు, కూరగాయలు, ఇతర పోషకాలు మరియు ధాన్యాలు మొదలైనవి తీసుకోవడం తగ్గిపోతుంది. అందువల్ల సమతుల ఆహారానికి గండి పడి కొన్ని విటమిన్స్ మరియు ప్రోటీన్స్ లోపం ఏర్పడుతుంది.  

  మెగ్నీషియం ఎక్కువ అవ్వడం వల్ల ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.

 జీడిపప్పులో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ఎముకలు మరియు దంతాలను ఆరోగ్యంగా ఉంచడం వంటి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అయితే మెగ్నీషియం ఎక్కువ అవడం వల్ల రోజువారీ అనారోగ్య సమస్యలు ఉన్నపుడు తీసుకునే మందుల ప్రభావాన్ని పనిచేయనివ్వకుండా ఈ మెగ్నీషియం అడ్డుకుంటుంది. దీనివల్ల జబ్బులు తొందరగా నయం కావు. 

 బిపి,షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలకు మందులు వాడేవారు జీడిపప్పు అధికంగా తినకుండా ఉండటం ఉత్తమం..

 తలనొప్పి మరియు మైగ్రేన్ ఉన్న వారికి మంచిది కాదు.  

 జీడిపప్పు తినడం వల్ల టైరమైన్, ఫినైల్థైలామైన్ వంటి అమైనో ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఇవి ఆరోగ్యానికి మంచివైనా, రక్తపోటును క్రమబద్దీకరించినా తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సున్నితమైన ఆరోగ సమస్యలు ఉన్నవారికి మంచివి కావు. వీటివల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. .  

చివరగా….

జీడిపప్పు ఆరోగ్యానికి మంచిదే అయినా టేస్ట్ బాగుంది కదా అని ఎక్కువగా తినేస్తే అనారోగ్యం ముంచుకురావడం ఖాయం. అతి ఎప్పటికైనా హాని కదా మరి.

Leave a Comment

error: Content is protected !!