చద్దన్నం రోగనిరోధక శక్తిని పెంచుతుందని పెద్దలు చెబుతుంటారు. ఇదే నిజమని అమెరికన్ అసోసియేషన్ చెప్తుంది. పెద్దవారి మాట చద్దన్నం మూట అని సామెత ఉంటుంది. మనం ఎప్పుడూ ఆ మాటలు అర్థం చేసుకోలేకపోయాము. మనందరికీ తెలుసు కోవిడ్ తగ్గాలంటే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలని చాలా వరకు డాక్టర్లు చెబుతున్నారు. అలాంటి చాలా వరకు విటమిన్స్ మనకు చద్దన్నంలో దొరుకుతాయి అని డాక్టర్లు చెబుతున్నారు.
క*రోనా వచ్చిన చాలామందికి శరీరం చాలా నీరసంగా అయిపోతుంది. చద్దన్నం క్రమం తప్పకుండా తీసుకునేవారిలో ఈ విటమిన్ బి 12 పుష్కలంగా ఉండి అలసటకు గురవుతారు. మన రోగనిరోధక శక్తిని బలపరచుకోవాలని అంటే ఐరన్, జింక్ చాలా అవసరం. ఆ విటమిన్ పులియబెట్టిన చద్దన్నం లో పుష్కలంగా లభిస్తాయట. మామూలు అన్నం తో పోలిస్తే పులియబెట్టిన అన్నంలో 21 శాతం ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటుందని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
పులియబెట్టిన చద్దన్నం రోగనిరోధక శక్తిని పెంచి క*రోనా వైరస్ నుండి రక్షిస్తుంది. ఎండాకాలంలో చద్దన్నం తినడం వలన వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. జీర్ణక్రియలో విడుదలైన హానికరమైన రసాయనాలను చద్దన్నం హరింప జేస్తుంది. అల్జీమర్స్, మతిమరుపు వంటి రోగాల నుండి కూడా కాపాడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. కడుపులో అల్సర్లు ఉన్నవాళ్లకి చద్దన్నం చాలా బాగా పనిచేస్తుంది. రక్తహీనత తగ్గించి దంతాలు, ఎముకలు బలంగా చేస్తుంది. ఇన్ని ప్రయోజనాలున్న చద్దన్నాన్ని పల్లెటూరి, పేదల ఆహారంగా పక్కన పెట్టేసి ఉంటాం.
మన పెద్దలు చెప్పిన మాటలు మనం ఇతర దేశస్తులు చెప్పిన విషయాలను ఆశ్చర్యపోతూ వింటాం. మన ఆహారానికి ఉన్న విలువను మనం గుర్తించం. అమెరికన్ అసోసియేషన్ గుర్తించిన తర్వాత మనదేశంలో చద్దన్నంకి విలువ పెరిగిందట. అందుకే పెద్ద పెద్ద హోటల్స్ మెనూలో కూడా చద్దన్నాన్ని ఈమధ్య చూస్తున్నాం..
చద్దన్నం ఎలా తయారు చేస్తారో ఒకసారి చూద్దాం. రాత్రి మిగిలిన అన్నంలో గంజి, నీరు పోసుకొని అలానే పొద్దుటి వరకు ఉంచుకోవాలి.. ఈ పద్ధతిని ఇప్పటికీ పల్లెటూరులో ఆచరిస్తూ ఉంటారు.
ఇంకో పద్ధతి ఏంటంటే కుండలో రాత్రి మిగిలిన అన్నాన్ని వేసి అందులో నిమ్మ లేదా దబ్బ ఆకులు వేసి పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల బాగా పులుస్తుంది. ఉదయాన్నే ఇందులో మజ్జిగ, ఉప్పు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ నంజుకుని తినొచ్చు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం అభివృద్ధి చెందడమే కాకుండా మంచి రుచిని ఆస్వాదించవచ్చు. చద్దన్నంని మన తెలుగు రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం అంతా తింటారు. అక్కడ వేరే పేర్లతో పిలుస్తారు. నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ ఆహారాన్ని క్రమంతప్పకుండా తీసుకోండి.