winter diet plan for weight loss

చలికాలంలో రోజుకు ఎన్నిసార్లు తింటున్నారు ?

సాధారణంగా మనిషి రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తింటారు.మిగిలిన సీసన్స్లో రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తిన్నా పర్వాలేదు. కానీ చలికాలంలో మాత్రం రోజుకి 2 సార్లు మాత్రమే తినాలి. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండి సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వలన ఆహారం అరగదు. ఆకలి తగ్గుతుంది. మనుషులకే కాదు పక్షులకు, జంతువులకు కూడా చలికాలంలో ఆకలి తగ్గిపోతుంది. అలాగే చలికాలం రాత్రి ఎక్కువగా పగలు తక్కువగా ఉంటుంది.

రాత్రి సమయంలో రెస్ట్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్  అవుతాయి. శరీరం రిలాక్సేషన్, మైండ్ రిలాక్సేషన్ కోసం హార్మోన్స్ రిలీజ్ అవడం వలన ఆకలి వేయదు. మిగిలిన సీసన్స్లో ఎన్నిసార్లు తిన్నా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మూడు నెలలు మాత్రం రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి. రోజు 8.30 ఆ సమయంలో టీ తాగి 9.30-10 గంటల మధ్యలో వేడి వేడిగా భోజనం తినేసి సాయంత్రం 3.30-4 గంటల సమయంలో వేడి వేడిగా తినేయాలి.

ఒకవేళ అలా ఉండలేము అనుకుంటే ఉదయం ఏదైనా జ్యూస్ తాగి 9.30- 10గంటల మధ్యలో భోజనం చేయాలి. మళ్లీ 3.30కి జ్యూస్ తాగి 5.30 – 6 గంటల మధ్యలో భోజనం చేయాలి. చలికాలంలో మూడు లేదా నాలుగు సార్లు తినడం వలన అరగక అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. రోజుకి రెండు సార్లు తినడం వలన ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుతుంది.  వేసవికాలంలో రోజుకు మూడు సార్లు లేదా నాలుగు సార్లు తిన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

కాబట్టి మూడుసార్లు తిన్నా పర్వాలేదు. కానీ చలికాలంలో సూర్యరశ్మి  లేక ఆహారం జీర్ణం అవ్వదు. ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రోజుకు రెండు సార్లు మీకు ఇష్టమైన ఆహారాన్ని వండుకొని వేడివేడిగా తినడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఉదయం, సాయంత్రం  మొలకలు, డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వలన  నేచురల్ గా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

రోజుకు రెండుసార్లు తిన్నప్పుడు వండిన ఆహారం అయినా తీసుకోవచ్చు. కానీ రెండు సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇలా అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. సంవత్సరం మొత్తం రోజుకి ఎన్ని సార్లు తిన్నా చలికాలం మూడు నెలలు మాత్రం రెండుసార్లు మాత్రమే తినండి.

Leave a Comment

error: Content is protected !!