కొంతమంది కి యోని భాగం దగ్గర నుంచి ఘాటైన దుర్వాసన వస్తుంది. ఈ సమస్య వల్ల దాంపత్య జీవితానికి దూరమవడం జరుగుతుంది. తరచూ వాళ్లకి యూరినరీ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లు వల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే ఇన్ఫెక్షన్ కారణమైన క్రీములు ఇన్ఫెక్షన్ నీ కలిగించడం వల్లే అలాంటి సమస్య వస్తుంది. దానివల్ల దురద వచ్చి ఇరిటేషన్ గా ఉంటుంది. మరి ఇలాంటి దాన్ని నాచురల్ గా తగ్గించాలి అంటే రెండు రకాలు గా అప్లయ్ చేయడం వల్ల త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. రోజుకి నాలుగయిదు సార్లు యూరిన్ కి వెళ్ళినపుడు వేపాకును 4,5 లీటర్ ల నీటిలో బాగా మరిగించాలి.
తరువాత చల్లార్చి వడకట్టి ఆ నీళ్లు ఇంట్లో ఉంచుకోండి. వాష్ రూమ్ కి వెళ్ళేటప్పుడు గోరువెచ్చగా వేడి చేసుకుని ఆ భాగాల్లో క్లీన్ చేసుకుంటే అక్కడ ఉండే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది లావెండర్ ఆయిల్. దీనిని తీసుకొని 2, 3 ml తీసుకుని దానికి 5 ml కొబ్బరి నూనె తీసుకుని ఈ ఆయిల్ ని నైట్ టైం పడుకునేటప్పుడు వేపనీళ్ళతో శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఈ ఆయిల్ ని రాసుకుని పడుకోవాలి. నాచురల్ గా ఇన్ఫెక్షన్ తగ్గించడానికి అక్కడ ఉండే బేడ్ ఆర్డర్ పోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా కూడా నిరూపించారు. ఇక మూడోది స్వచ్ఛమైన తేనెను తీసుకోవాలి.
దీనిని రోజుకి రెండుసార్లు అయినా ఆ భాగాల్లో అప్లై చేయాలి. ఇలా చేస్తే దురద, వాసన రావడం తగ్గుతుంది. అక్కడ ఉండే బ్యాక్టీరియాలను చంపడానికి తేనె అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తూ ఉండాలి. దురదలు ఎక్కువ ఉండి, ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి, వాసన ఎక్కువగా ఉంటే 5,6 రోజులు స్త్రీలు జ్యూస్ ఫాస్టింగ్ చెయ్యాలి. తర్వాత 1,2 రోజులు ఫ్రూట్ ఫాస్టింగ్ చేసి తర్వాత భోజనానికి వెళ్తే నేచురల్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. ఇది నాచురల్ గా ఉపయోగపడుతుంది. ఇలా చేసుకుంటూ కాటన్ లో దుస్తులు వాడుతూ ఉంటే మంచిది. గాలి బాగా ఆడే దుస్తులను వేసుకోవాలి. రెగ్యులర్గా యోని భాగంలో క్లీన్ చేసుకోవడం చాలా మంచిది.
ఇలాంటి పరిశుభ్రతను పాటిస్తే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.