ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సముద్రం లోతు తెలుసుకోవడం ఆడవారి మనసును అర్థం చేసుకోవడం రెండు ఒకటే. ఆడవారు ఒక్కోసారి ఒకలా ఉంటారు. మహా జ్ఞానులు కూడా ఆడవారిని అర్థం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఎన్నో పుస్తకాలు చదివిన పండితులకు కూడా ఆడవారిని అర్థం చేసుకోలేకపోయారు. ఆడవారు పుట్టిన నెలను బట్టి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన వారు అందంగా, ఆకర్షణీయంగా, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు ప్రతిభావంతులు అయ్యి ఉంటారు.
వీరి గురించి బయట వ్యక్తులు చెడుగా మాట్లాడుకుంటే అసలు సహించలేరు. స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఫిబ్రవరి నెలలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వీరు జాలి, దయ, ప్రేమ, అభిమానం ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి గురించి ఎదుటివారు ఏం మాట్లాడుకుంటున్నారో అసలు పట్టించుకోరు. ఎవరైనా మోసం చేస్తే అసలు క్షమించరు. వీళ్ళ మూడ్ ఒకసారి ఒకలా ఉంటుంది. అర్థం చేసుకోవడం చాలా కష్టం. మార్చి నెల పుట్టిన వారు చాలా కోమలంగా ఉంటారు.
వీరు ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతారు. వీరిలో ధైర్యం తక్కువగా ఉంటుంది. వీరు ఎవరైనా నవ్వితే చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వారు శాంతంగా, అందంగా, కలుపుగోలుగా ఉంటారు. ఎంత కష్టమైన పని అయినా ఈజీగా చేయగలుగుతారు. ఎక్కువ అసూయగా, యాక్టివ్గా, డైనమిక్ గా ఉంటారు. మే నెలలో పుట్టిన వారు కొంచెం కోపంగా ఉంటారు. కానీ వీరి కోపం క్షణాల్లో తగ్గిపోతుంది.వీరు ప్రేమలో పడటం చాలా కష్టం. వీరు చాలా కఠినంగా ఉంటారు.
జూన్లో పుట్టిన వారు సిగ్గు పడే స్వభావం కలిగి ఉంటారు. సృజనాత్మకత, శాంతస్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా ముందు వెనుక ఆలోచించి మాట్లాడుతారు. ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. మనిషి ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా మాట్లాడడం అస్సలు నచ్చదు. జూలై నెలలో పుట్టిన వారు చాలా మంచిగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీరు నిజాయితీగా ఉంటారు. గొడవలకు దూరంగా ఉంటారు. మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. బంధాలకు విలువనిస్తారు.
ఆగస్టులో పుట్టిన వారు చాలా హుషారుగా, కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామిని వారే వెతుక్కొని వాళ్లని సాధించుకోవడంలో ఎక్కువ కష్టపడతారు. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరు చాలా అమాయకంగా, అందంగా అనుకున్నది సాధించే విధంగా ఉంటారు. భాగస్వామి విషయంలో సున్నితమైన మనస్తత్వం కలవారై ఉండాలని కోరుకుంటారు. అక్టోబర్ లో పుట్టిన వారు అందంగా, అమాయకంగా ఉంటారు. ఎదుటివారి మనసు నొప్పించడం అసలు ఇష్టం ఉండదు. భావోద్వేగాలు, జాలి, దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి.
నవంబర్ నెలలో పుట్టిన వారు చాలా అందంగా, తెలివిగా ఉంటారు. అన్నిటిలోనూ అందరికంటే ముందుంటారు. అబద్ధం చెప్పినట్లయితే వెంటనే పసిగడతారు. డిసెంబర్ నెలలో పుట్టిన వారు మంచి మాటకారులు. ఏ విషయమైనా చక్కగా డీల్ చేయగలుగుతారు. ఓపెన్ మైండెడ్గా ఉంటారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే శక్తిని కలిగి ఉంటారు.