wonderful health benefits of eating garlic on empty stomach

పరగడుపునే 4 రోజులు వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా?

ఉల్లి తర్వాత అంతటి మేలు చేసేది వెల్లుల్లె… దీనిలోని ఔషధ గుణాలను గుర్తించిన మన పూర్వీకులు వెల్లుల్లిని అనేకరకాలుగా వాడుతూ వస్తున్నారు. ఇది సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ గా పనిచేసి శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ప్రతిరోజు పరగడుపున రెండు వెల్లుల్లి తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

హై బిపి

హైబీపీ తో బాధపడేవారు రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటూ ఉంటే బీపీ కంట్రోల్ లోకి వచ్చేస్తుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి బీపీని అదుపులో ఉంచుతుంది.

జ్ఞాపక శక్తి పెరగడానికి 

ప్రతిరోజు రెండు వెల్లుల్లి రెబ్బలు పొట్టు ఒలిచి తింటూ ఉంటే మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

దగ్గు జ్వరం 

రొంప దగ్గు జ్వరంతో బాధపడేవారు వెల్లుల్లి రసం కొంచెం తేనెలో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటే చక్కటి ఉపశమనం కలుగుతుంది

చర్మానికి

అలర్జీలు దద్దుర్లు వచ్చినప్పుడు వెల్లుల్లి రసాన్ని అల్లం రసంతో  మిక్స్ చేసి అవి ఉన్న చోట పై పూతగా పూస్తే త్వరగా తగ్గిపోతాయి.

రోగనిరోధక శక్తి 

కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండి ఇ తరచుగా జలుబు జ్వరం బారిన పడుతూ ఉంటారు అలాంటి వారు వెళ్ళుళ్ళి రెబ్బల పొట్టు తీసి నేతిలో వేయించి క్రమం తప్పకుండా తింటుంటే ఇమ్యూనిటీపవర్ పెరిగి త్వరగా వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.

అధిక బరువు

అధిక బరువుతో ఇబ్బంది పడేవారు వెల్లుల్లిపేస్ట్ లో కొంచెం తేనె చేర్చి రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గి బరువు తగ్గుతారు.

డయాబెటిస్ 

మధుమేహం ఉన్నవారు రోజూ పరగడుపున వెల్లుల్లి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు క్రమబద్ధం అయ్యి షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది.

నోటి ఆరోగ్యానికి

ప్రతిరోజు బ్రష్ చేసుకున్నారా రెండు వెల్లుల్లి రెబ్బలు నవ్వుతూ ఉంటే నోటిలో ఉన్న హానికారక బ్యాక్టీరియా నాశనం అవుతుంది.

దగ్గు ఉబ్బసం 

గ్లాసు పాలలో మిరియాల పొడి పసుపు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి తాగుతూ ఉంటే ఎంతోకాలం నుండి వేధిస్తున్నా దగ్గు ఉబ్బసం తగ్గిపోతాయి.

మొటిమలు మచ్చలు  

మొహం పైన ముఖం మొటిమలు తెల్ల మచ్చలు ఇబ్బంది పెడుతున్నప్పుడు వెల్లుల్లిని ఉడికించి మెత్తగా చేసి మొటిమలు మచ్చలు ఉన్న చోట లేపనంగా పూస్తే ఉంటే చక్కటి ఫలితం ఉంటుంది.

గోరుచుట్ట 

గోరుచుట్టు వేసినప్పుడు వెల్లుల్లిని మెత్తగా దంచి గోరు చుట్టూ ఉన్న భాగంలో కట్టు కడుతూ ఉండాలి ఇలా చేస్తే గోరుచుట్టు తగ్గిపోతుంది.

3 thoughts on “పరగడుపునే 4 రోజులు వెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలుసా?”

Leave a Comment

error: Content is protected !!