world most dangerous plants

భయపడేవారు చూడకండి. ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే పారిపోండి లేదంటే….

మనిషి మనుగడకు చెట్లు చాలా అవసరం. చెట్లు లేనిదే ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకపోతే జీవరాశికి మనుగడే ఉండదు. అయితే ఈ చెట్లలో ప్రాణాలు పోతే అద్భుతమైన ఔషధ గుణాలు గల చెట్లు ఉన్నట్టే, ప్రాణాలు తీసే చెట్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న కీటకాలను తినే మొక్కలు గురించి మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని చెట్లు మనుషులను కూడా ప్రమాదకరంగా ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్ట్రేలియా అడవులలో ఉండే గింపి గింపి అనే చెట్టు చూడడానికి రావి ఆకులను పోలి ఉంటుంది. చిన్న పొదలా ఉండే ఈ చెట్టు ఆకులు పైన సన్నగా ఉండే ముళ్ళను కలిగి ఉంటుంది. పొరపాటున ఈ ఆకును తాకడం వలన ముళ్ళు చర్మంలోకి చేరి విపరీతమైన బాధను కలుగజేస్తాయి. ఆ బాధ ఎంత విపరీతంగా ఉంటుందంటే చనిపోతే బాగుండు అనిపించేలాగా ఉంటుంది.

 ముళ్ళను శరీరం నుండి తీసేసిన రెండు గంటల వరకు ఈ నొప్పి ఇలాగే ఉంటుంది. తరువాత కొన్ని సంవత్సరాల వరకు ఆ ప్రదేశంలో నొప్పి ఉంటుందని చెబుతున్నారు. అలాగే దక్షిణ అమెరికాలోని మెషినల్ అనే చెట్టు కూడా మనుషులకు చాలా ప్రమాదకరమైనవి. వీటి పండ్లు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటికి ఆకర్షింపబడి వీటిని తినడం వలన మరణం సంభవిస్తుంది. అందుకే ఈ పండ్లను డెత్ యాపిల్స్ అంటారు. తర్వాత మరొక చెట్టు గురివింద గింజలు చెట్టు. అందమైన ఎర్రటి రంగులో నల్లటి మచ్చలు కలిగి ఉండే గురివింద గింజలు విషపూరితమైనవి. వీటిని తీసుకోవడం వలన మరణం సంభవించే అవకాశం ఉంది. ఒకప్పుడు వీటిని నగల తయారీలో ఉపయోగించే వారు. వీటి యొక్క విషప్రభావం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఉపయోగించడం లేదు.

 తర్వాత మొక్క జెయింట్ హాగ్వీడ్. ఈ చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ చెట్టు యొక్క పువ్వులు తినడం వలన ఇప్పటికే చాలా మంది చనిపోయారు. అలాగే ఈ చెట్టు పువ్వులు కంట్లో పడితే కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. తర్వాత మొక్క పాయిజన్ ఓయేట్ ఐవీ. ఈ మొక్కలు తాకడం వలన చర్మంపై ఎర్రటి బొబ్బలు వచ్చి కొంత మంది చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ మొక్క మనుషులకు చాలా ప్రమాదకరమైనవి అని శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే మనుషులకు ప్రమాదకరమైన మరో మొక్క షేర్బేరా ఓల్డేల్లం. ఈ మొక్క పువ్వులు, ఆకులు, కాయలు అన్నీ చాలా విషప్రభావంతో కూడి ఉన్నవి. ఈ మొక్కలను సూసైడికల్ ట్రీ అంటారు. మన గన్నేరు చెట్టు ఎలా అయితే ఈ విష ప్రభావంతో ఉంటుందో ఈ చెట్టు కూడా అంతే విష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. 

మరో మొక్క ఒక హాక్ బీడ్ అని పిలుస్తారు. దీనిని కిల్లర్ ట్రీ అని కూడా పిలుస్తారు.ఈ చెట్టు ఆకులను పొరపాటున తాకడం వలన  చర్మం కాలి పోతున్నట్లు అనిపించడం, చర్మంపై చీముతో నిండిన పెద్ద పెద్ద బొబ్బలు రావడం జరుగుతుంది. ఈ ఆకులను తాకిన 48గంటల్లో మనిషి మరణించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతగా విషప్రభావం కలిగి ఉంటాయి. అందుకే ప్రాణాల్ని పోసే చెట్లు ప్రాణాల్ని కూడా తీసే అవకాశం ఉంది కనుక తెలియని చోటకి వెళ్ళినప్పుడు వీలైనంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అందంగా ఉన్నదని ప్రతి చెట్టు ముట్టుకోకూడదు.

Leave a Comment

error: Content is protected !!