పళ్ళు అందమైన పళ్ళవరసతో పాటు అవి తెల్లగా మెరవడం కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ మనం తీసుకునే టీలు, కాఫీలు తీపిపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వలన పళ్ళు పసుపుపచ్చని గారపట్టి చూడడానికి అసహ్యం గా కనిపిస్తాయి. అంతేకాకుండా నోటిదుర్వాసనకు కారణమవుతాయి. పళ్ళను అలాగే వదిలేస్తే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువయిపోయి పంటి సమస్యలు పళ్ళు వదులైపోవడం , చిగుళ్ళు అరిగిపోవడం వంటి అనేక సమస్యలకు కారణమవుతుంది. పళ్ళను తెల్లగా మార్చడానికి మార్కెట్లో అనేక రకాల పేస్టు లు, ట్రీట్మెంట్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ అవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. అందుకే ఇంట్లో న దొరికే పదార్థాలతో పళ్ళను తెల్లగా మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
దానికోసం మనకి కావలసిన పదార్థాలు ఆవనూనె.ఆవనూనె పళ్ళపై గారను తొలగించి ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. తర్వాత పసుపు తీసుకోవాలి. పసుపులో ఉండే కర్క్యుమిన్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని బాక్టీరియాను తొలగించడంతో పాటు పళ్ళపై గారను తొలగిస్తుంది. తర్వాత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు పళ్ళపై గారను తొలగించే ఏజెంట్గా పనిచేస్తుంది. తర్వాత కావలసింది కారెట్ తురుము. కారెట్ ని చిన్నచిన్న ముక్కలుగా కానీ పేస్ట్ లా కానీ చేసి ఒక స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపాలి. కేరట్లో ఉండే విటమిన్ కె పళ్ళను కాపాడడంతో పాటు పళ్ళపై ఎనామిల్ను కాపాడుతుంది. పళ్ళను తెల్లగా మారుస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను బ్రష్తో పళ్ళను తోముకుంటే సరిపోతుంది.
మూడు నుండి నాలుగు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. ఇలా కొద్ది రోజులు పాటు చేయాలి. ఇలా చేస్తే పళ్ళపై గార తగ్గడంతోపాటు పళ్ళు వదులయినవి మళ్ళీ టైట్ అవుతాయి.అలాగే పళ్ళసమస్యలు రాకుండా ఉండావన్నా పళ్ళపై గారపట్టకూడదన్నా ఏవైనా తీపిపదార్థాలు తిన్నవెంటనే నోటిని నీరు లేదా మౌత్ వాష్తో శుభ్రపరుచుకోవాలి. ఎందుకంటే చక్కెర పదార్థాలు పళ్ళపై పేరుకుపోవడం చాలా ప్రమాదకరం. ఎక్కువ సేపు పళ్ళపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. అందుకే నోటిని పుక్కిలించి రోజుకు రెండు సార్లు మంచిగా బ్రష్ చేయాలి.