ఇప్పటి వరకు వేసవికాలం కాబట్టి అందరూ సన్ టాన్ వలన రంగు మారిపోయి ఉంటారు. సన్ టాన్, జిడ్డు, మురికి పోగొట్టుకోవడానికి బ్యూటీపార్లర్‌కు వెళ్తే వేలకు వేలు ఖర్చు అవుతుంది. కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఈ చిట్కా ట్రై చేసినట్లయితే మీ శరీరం తెల్లగా మెరిసిపోతుంది. కాళ్లు చేతులు మోచేతులు మోకాళ్ళు మెడ వంటి భాగంలో నల్లగా అయిపోయి ఉంటాయి.
దానికోసం రకరకాల క్రీములు లోషన్లు వాడినప్పటికీ ప్రయోజనం ఉండదు ఎక్కువగా ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి. నాచురల్ పద్ధతిలో వీటిని ఈజీగా తగ్గించుకోవచ్చు. తయారు చేసుకోవడానికి మనం ముందుగా ఏ బ్రాండ్ అయినా ఒక చెంచా కాఫీ పొడి తీసుకోవాలి. కొంచెం బరకగా ఉన్నట్లయితే చిన్న రోట్లో వేసుకొని మెత్తగా పొడిలా చేసుకోవాలి. దీనిలో ఒక చెంచా పంచదార వేసుకోవాలి. పంచదారను కూడా ఒకసారి రోటిలో వేసుకొని కొంచం బరకగా దంచుకోవాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల స్వచ్ఛమైన కొబ్బరి నూనెను వేసి బాగా కలుపుకోవాలి.
మిశ్రమాన్ని బాగా కలిపి శరీరంపై సన్ టాన్ వల్ల రంగు మారిన భాగంలో అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో 5 నుంచి 10 నిమిషాలపాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. దీని తర్వాత రెండవ స్క్రబ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా పంచదార మెత్తగా పొడి లాగా చేసి వేసుకోవాలి. దీనిలో ఒక చెంచా పచ్చి పసుపు వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందు కాఫీ పొడి, షుగర్ ఫ్యాక్ తో ఏ భాగంలో అప్లై చేసామో ఈ మిశ్రమాన్ని కూడా ఆ భాగంలో అప్లై చేసి పది నిమిషాలు సర్కులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలి.
ఇలా చేసినట్లయితే సన్ టాన్ వల్ల రంగు మారిన చర్మం తెల్లగా మెరిసిపోతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన జిడ్డు, మురికి మాయమైపోతాయి. పచ్చి పసుపు చర్మ ఛాయను మెరుగు పరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొబ్బరినూనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. కాఫీ పౌడర్ చర్మంపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. పంచదార చర్మానికి మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా సన్ టాన్ వలన రంగు మారిన, చర్మం పై పేరుకున్న జిడ్డు, మురికి వంటి సమస్యలను తగ్గించుకోవాలంటే ఈ చిట్కాలను ట్రై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది.