మానవ శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు తాగడం చాలా అవసరం. కానీ ఆ నీటిని తాగడానికి కూడా ఒక పద్దతి ఉంటుంది. ఎలాపడితే అలా తాగడంవలన అనేక అనారోగ్యాల పాలవుతాం. ఇప్పుడున్న బిజీ లైఫ్లో కనీసం నీళ్ళు తాగేందుకు కూడా సమయం ఉండడంలేదు. 90శాతం మంది నీటిని తాగడంలో తప్పులు చేస్తున్నారు. నీటివలన కలిగే లాభాల కన్నా ఇలా తెలిసీతెలియక చేసే తప్పులు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. నీటిని తాగే సరైన పద్దతి ఏంటో తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
నీరు తాగకపోతే తీసుకున్న ఆహారంలో నూట్రీషన్స్ ని కూడా శరీరం సంగ్రహించలేదు. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. భోజనం తిన్న వెంటనే నీళ్ళు తాగకూడదు. అలా తాగితే అది విషంలా పరిణమిస్తుందని ఆయుర్వేదం లో చెప్పబడింది. ఆహారం తీసుకున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. జీర్ణరసాలు ఉత్పత్తి అవడానికి వీలుగా మనం తిన్న వెంటనే నీళ్ళు తాగడం వలన జీర్ణరసాలు పలచబడి సరిగా జీర్ణం కాదు. ఆహారం జీర్ణం కాకపోవడంవలన అజీర్ణం, గ్యాస్, మలబద్దకం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
కొంతమంది ఎంతతిన్నా సన్నగానే ఉంటారు. వారుతిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందక శరీర ఎదుగుదల లోపిస్తుంది. అందుకే తిన్న వెంటనే నీళ్ళు తాగకండి. తిన్న తర్వాత నీటితో నోరు పుక్కిలించడం వలన పళ్ళలో చిక్కుకున్న పదార్థాలు తొలగి నోటి మరియు ఆహార వాహిక ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.
నీటిని ఎప్పుడూ కూర్చుని తాగాలి. నిల్చొని లేదా పరిగెడుతూ తాగడంవలన అది నేరుగా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. శరీర ద్రవాలను పలుచగా చేసి ఆర్థరైటిస్ లాంటి సమస్యలకు కారణమవుతుంది.
ఫ్రిజ్ లోని నీళ్ళు తాగకూడదు. రాగిపాత్రలో నీళ్ళు తాగాలి. చల్లని నీళ్ళు తాగడంవలన గొంతు సమస్యలు ఏర్పడడమే కాకుండా జీర్ణ సమస్యలు కూడా కలిగిస్తుంది. చల్లని నీళ్ళు ఆహారంలో ని కొవ్వులను గడ్డకట్టేలా చేస్తాయి. రక్తనాళాలు కుచించుకు పోయేలా చేస్తాయి. గుండె వ్యాకోచసంకోచాలను తగ్గిస్తుంది. గోరువెచ్చని నీళ్ళు తాగడం మంచిది. ఎండాకాలం కూడా ఫ్రిజ్ లోని నీళ్ళకన్నా కుండనీళ్ళే మంచిది. అందులో ph లెవల్స్ అదుపులో ఉంటాయి.
మరీ ఎక్కువగా కూడా నీళ్ళు తాగకూడదు. రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీరు సరిపోతుంది. మూత్రం నీళ్ళ రంగులో ఉంటే మీరు సరిపడా నీళ్ళు తాగుతున్నారని అర్థం. పెదవులు ఎండిపోయి పగిలినట్టు ఉంటే సరిపడా నీళ్ళు తాగడంలేదని అర్థం చేసుకోవాలి. అలాగే దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాలి. ఎక్కువగా తాగడంవలన కిడ్నీలలో చేరి కిడ్నీల పనితీరు పాడవుతుంది. ఇవండీ నీటిని తాగేవిధానంలో మంచి, చెడులు. ఇకపై సరైన పద్థతి లో నీటిని తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.