కరోనా వైరస్ కొట్టిన దెబ్బకి ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. దానినుండి ఉపశమనానికి రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు అనేక మందులు చిట్కాలు పాటించేసారు కూడా. కానీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలు మనల్ని కరోనా రాకుండా అఢ్డుకోవడంతో పాటు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆవేంటో ఏలా వాడాలో చూసేద్దాం.
మనకి స్వీట్స్లో ఉపయోగించే పచ్చకర్పూరం గురించి తెలిసే ఉంటుంది. దీనిని స్వీట్స్ లోనే కాకుండా జండుబామ్ లాంటి నొప్పి నివారణ మందుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. దీని ఘాటైన వాసన వల్ల క్రిములు, బ్యాక్టీరియా వంటివి దరిచేరవు. అందుకే దీనిని నీటిలో వేసి ఆవిరి పట్టాలి.ఇలా చేయడం వల్ల ముక్కు, నోట్లోని వాయునాళాలు శుభ్రపడి ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి.
అలాగే దీని వాసన చూడడం వల్ల మనసులోని ఆందోళనలు, భయం పోయి మనసు తేలికగా అనిపిస్తూ ఉంటుంది. నిద్రలేమి ఉన్న వాళ్లు కూడా దీని వాసన పీల్చడం మంచి ఉపశమనం కలిగిస్తుంది కాకపోతే ఇంట్లో ఫిట్స్ ఉన్నవారు పిల్లలు లేదా పెద్దలు ఎవరైనా సరే దీని వాసన పీల్చకూడదు.
అలాగే మరో చిట్కా ఏంటంటే మన అందరి ఇంట్లో ఉల్లిపాయలు తప్పకుండా ఉంటాయి అందులోనుంచి ఒక ఉల్లిపాయ తీసుకొని కింద భాగం కాకుండా పైన వేళ్లతో ఉండే భాగాన్ని కట్ చేసి పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేయడం వలన ఉల్లి లో ఉండే ఘాటైన వాసనకు బ్యాక్టీరియాలాంటివి దరిచేరవు. దీని నుంచి వెలువడే సల్ఫర్ క్రిములను నాశనం చేస్తుంది.
అలాగే మరొకటి మనం ఎక్కువ వైరస్ ఉండే ప్రదేశాలు బాత్రూములు. ఎవరు వాడినా బాత్రూంలో ఏ వైరస్ ఉంది మనకు అర్థం కాదు. అలాంటప్పుడు లేదా మనం బయటకు వెళ్లి వచ్చినప్పుడు నేరుగా బాత్రూమ్కు వెళుతూ ఉంటాం. మనతో పాటు వచ్చిన అన్ని బాత్రూం లో చేరి అక్కడ తమకు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే బాత్ రూమ్ లో ఒక చిన్న కప్పుతో కళ్ళుఉప్పు పెట్టాలి. ఉప్పు సహజ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలతో బాక్టీరియావంటిదేమీ లేకుండా నిరోధిస్తుంది. ఇలా చేయడం వలన బాత్రూంలో నెగిటివ్ శక్తిని చెడు గాలిని లాక్కొని మంచిగాలిని ప్రసరించేలా చేస్తుంది.
అలాగే ఇప్పుడు మన శరీరంలో పీహెచ్ లెవెల్స్ పడిపోకుండా ఆల్కలీన్ వాటర్ తాగుతూ ఉండాలి. ఆల్కలీన్ వాటర్ అంటే మార్కెట్లో లభిస్తాయి. అలా కాకుండా సహజ ఆల్కలీన్ వాటర్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక గ్లాస్ మరిగించిన నీటిని తీసుకోవాలి. అవి గోరువెచ్చగా అయ్యేంతవరకు ఉంచి అందులో ఒక నాలుగు ముక్కలు కీర తరిగి వేసుకోవాలి.
అలాగే నిమ్మకాయను ముక్కలుగా కాకుండా స్లైసులు గా అంటే సన్నగా తరిగి ఈ నీటిలో వేసుకోవాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇలా తీసుకోవడం వల్ల ఇది శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వీటన్నిటితో పాటు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కు, శానిటైజర్ వాడుతూ ఉంటే కరోనా మహమ్మారికి వీలైనంత దూరంగా ఉంటాము.
Smell ravadaniki.yem cheyali
Sir, I need a help how to solve “fits ” on Ayurveda give me perfect medicine by anandhaiah garu kindly help me to solve this issue