చిన్నతనంలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రోడ్ కు ఇరువైపులా ఎక్కువగా కనిపించే చెట్టు కానుగ చెట్టు. కానుగ చెట్టు నీడన కూర్చుంటే చల్లని భావన సొంతమయ్యేది. వేసవిలో ఎండకు అలసిన బాటసారులు కానుగ చెట్టు కనబడగానే కాస్త విశ్రాంతి తీసుకునే వారు. ప్రస్తుతం కానుగ చెట్లు చాలా కనుమరుగైపోతున్నా వాటిలోని ఔషధ గుణాలు మాత్రం అలాగే ఉన్నాయ్. ఇలాంటి కానుగ చెట్టులో నమ్మలేని ఆరోగ్య రహస్యాలు అవేంటో ఒక్కసారి చూద్దాం.
కానుగ చెట్టులో ప్రతి భాగం కూడా గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉంది. కాయలు, ఆకులు, వేర్లు, కానుగ బెరడు ఇలా అన్ని ఉపయోగపడతాయి. ఏ భాగం దేనికి ఉపకరిస్తుందో విశ్లేషణగా మీకోసం.

కానుగ ఆకులు:
కానుగ చెట్టు ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్ సమస్యలు, కడుపునొప్పి, నీళ్ల విరేచనాలు, దగ్గు మొదలైన సమస్యలు నయమవుతాయి. అంతేకాదు కానుగ ఆకుల కషాయం వల్ల గనేరియా సమస్య కూడా తగ్గిపోతుంది.
కానుగ ఆకులను వేడిగా ఉన్న బియ్యం గంజిలో వేసి కాస్త చల్లారిన తరువాత ఆ ఆకును తీసివేసి ఆ గంజిని తాగాలి. ఇలా చేయడం వల్ల వాంతులు తగ్గుముఖం పడతాయి.

కానుగ గింజలు:
కానుగ చెట్టుకు బాదం కాయల్లా బల్లపరుపుగా కాయలు కాస్తాయి. ఈ కాయల లోపల విత్తనాలు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.
గాయాలు తగిలినపుడు రక్త ప్రవాహం తగ్గకపోతే కానుగ గింజలను మెత్తగా నూరి తేనె లేక, నెయ్యి లేక పంచదార ఏదో ఒక దానితో కలిపి తీసుకోవడం వల్ల రక్తప్రవహం తగ్గుముఖం పడుతుంది.
కానుగ గింజలు మెత్తగా నూరి వేయించిన ఉప్పులో కలిపి పెరుగు మీద తేటగా వచ్చిన నీటిలో కలిపి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల కూడా శరీరంలో రక్తం ఆగకుండా పోతున్నప్పుడు చక్కని ఫలితాన్ని ఇస్తుంది.
కానుగ వేర్లు:
కానుగ చెట్టును ఏదైనా సమస్య వల్ల కూలగొట్టినపుడు వాటి వేర్లను సేకరించి ఉంచుకోవడం చాలా మంచిది. కానుగ వేరు పచ్చిది లేక ఎండిన వేరును పొడి చేసి నిల్వ ఉంచుకున్నది అయినా సరే దానిని పేస్ట్ గా చేసి బాధిస్తున్న గడ్డల మీద పట్టులాగా వేయాలి. దీనివల్ల ఆ గడ్డలు తొందరగా పక్వం చెంది పగిలిపోయి లోపలున్న బాక్టీరియా తాలూకు చీము లాంటివి బయటకు వచ్చేస్తాయి. తొందరగా సమస్య తగ్గిపోతుంది.
కానుగ చెట్టు బెరడు:
బెరడు అంటే చెట్టుకు పై భాగాన దాలసరి మందంగా ఉన్న చెక్కలాంటిది. దీన్ని తొలగిస్తేనే మనకు కలప లభ్యమవుతుంది. కాబట్టి ఈ బెరడు నూరి రక్త మొలలపైన లేపనంగా చేస్తుంటే రక్తమొలల సమస్య తొందరగా తగ్గుతుంది.

కానుగ నూనె:
ఈ నూనెను సాధారణంగా దేవుడి దీపాలు పెట్టడానికి ఉపయోగిస్తారు. ఈ నూనెలో ఉన్న యాంటీ బయాటిక్ గుణాల వల్ల నూనె వత్తి ద్వారా కాలుతూ ఇచ్చే సువాసన ఇంట్లోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది.
కానుగ నూనెను గజ్జి, తెల్లమచ్చలు ఉన్న ప్రదేశం లో రాయడం వల్ల తొందరగా తగ్గిపోతాయి
ఊపిరితిత్తులలో నీరు చేరడం, జలులు వంటి సమస్యలు వచ్చినపుడు కానుగ నూనెను ఛాతీ మీద రాయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
కానుగ నూనెను వైద్యుల పర్యవేక్షణలో కడుపుకు తీసుకోవడం వల్ల కాలేయాన్ని శక్తివంతంగా చేస్తుంది.
చివరగా….
కానుగ చెట్టు పుల్లలను వేప పుల్లల్లా ఉపయోగించి పళ్ళు తోమడం వల్ల నాలుగు మీద చచ్చుబడిన రుచిమొగ్గలు తిరిగి నూతనోత్తేజాన్ని సంతరించుకుంటాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కానుగ చెట్టు విత్తనాన్ని మీ ఇంటి పెరడులో ఒక్కసారి వేసి మీ పనిలో మీరు నిమగ్నం అయిపోండి. మీరు వేసిన చిన్న విత్తనం ఆరోగ్యాన్ని ఇచ్చే పెద్ద వృక్షమై మీ జబ్బులను తగ్గిస్తుంది.