పాలకూర ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఓవరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడయ్యింది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కళంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది జ్వరం పిత్త వాయు శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. రక్తాన్ని శుద్ధిచేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్త్రీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది.
పాలకూరను వెజిటబుల్ సూప్లో , చపాతీలు చేసుకునే పిండిలోనూ పకోడీల పిండిలోనూ పన్నీర్తో కలిపి వండే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు. ఇతర ఆకుకూరలులాగా పాలకూరను కూరలాగా వేపుడు చేసుకుని కూడా తినవచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజూ తీసుకుని ఆహార పదార్థాలలో పాలకూర భాగం చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని చెప్పక తప్పదు.
ఆకుకూరల్లో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి అందుకే శరీర పెరుగుదల దృఢత్వానికి చక్కటి ఆరోగ్యానికి ఇవి చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో అనేక రకాలైన ఆకుకూరలు వినియోగంలో ఉన్నాయి. వీటిలో తోటకూర పాలకూర మెంతికూర మునగాకులు గోంగూర పుదీన తదితరాలు ముఖ్యమైనవి. ఆకుకూరలు ఎక్కువగా ఖనిజ పోషకాలు ఇనుముధాతువు కలిగి ఉంటాయి. శరీరంలో ఇనుము లోపం కారణంగా అనీమియా వ్యాధికి గురవుతారు. గర్భవతులు బాలింతలు అనగా పాలిచ్చే తల్లులు పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతారు. ప్రతిరోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను తప్పకుండా చేర్చుకోవాలి. తద్వారా అనీమియాను నివారించి చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చు.
ఆకుకూరల్లో కాల్షియం విటమిన్ కెరోటిన్ విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్-ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతి యేటా ఐదేళ్ళ లోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేల మంది కంటిచూపును కోల్పోతున్నారు. ఆకుకూరల నుండి లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎ గా మారి అంధత్వం రాకుండా చేస్తుంది. విటమిన్-సి ఆరోగ్యకరమైన ఎముకలు దంతాలకు చాలా అవసరమైన పోషకం. వంట చేసేటప్పుడు ఆకుకూరలను ఎక్కువసేపు మరిగిస్తే వీటిలో ఉన్న విటమిన్ సి ఆవిరైపోతుంది. దీనిని నివారించడానికి ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి. ఆకుకూరల్లో కొన్ని రకాల బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.

మనం తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ ఆకుకూరలను తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యముగా పాలకూర . పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరపును దూరం చేస్తాయి. పాలకూరలో లో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి యంటి కాన్సర్ ఏజెంట్స్ గా పనిచేస్తాయి. పాలకూర అనగా స్పినాచ్ ఇది భారతీయుడు ఆహారానికి ఉపయోగించి ఆకుకూరల్లో ఒకటి. ఇందులో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది ఆకు కూరలు వండే ముందు శుభ్రంగా కడగాలి. మొక్కలోని ఆకులను ఆహార పదార్థాలు గా ఉపయోగించే వాటిని ఆకు కూరలు అంటారు. దాదాపు 1000 కి పైగా ఆహార యోగ్యమైన ఆకులు గల మొక్కలు ఉన్నాయి. ఆకుకూరలు సాధారణంగా పొట్టిగా గుబురుగా పెరిగే స్వల్ప కాల పరిమితి గల చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను లేత ఆకు కాడలు కూడా తినడానికి ఉపయోగిస్తారు.
పాలకూరలో లభించే విటమిన్ సి ఏలు మరియు మెగ్నీషియం పోలిక్ యాసిడ్ క్యాన్సర్ నివారించటంలో తోడ్పడతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు బ్రెస్ట్ క్యాన్సర్ ను అదుపు చేయటంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. పాలకూరలో ఇంకా సోడియం క్యాల్షియం క్లోరైడ్ ఫాస్పరస్ ఇనుము ఖనిజ లవణాలు ప్రోటీన్లు విటమిన్ ఏ విటమిన్ సి తదితరాలు ఉంటాయి.