you must know kiwi fruit health benefits

ఈ పండుతో సమస్యలన్నీ దూరం

కివి పండ్లు దీనికి పేర్లు చాలానే ఉన్నాయి చాలామంది దీనిని వండర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఈ పండు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. పండ్ల అన్నింటిలోకి అధిక పోషకాలు కలిగిన ఈ కివి పండు పై Rutgers యూనివర్సిటీకి చెందిన డాక్టర్ పౌల్ లారెన్స్ కొన్ని పరిశోధనలు చేశారు. సాధారణంగా మనం తినే 27 రకాల పండ్లలో అన్నింటిలోకి కివి పండులో అధిక పోషకాలు ఉంటాయని ఒక స్టడీ తెలిపింది.

కివి పండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కివి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరెంజ్ లో కంటే కివి పండులో విటమిన్-సి రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. రోజులో తినవలసిన పోషకాలకు ఒక కివి పండు తింటే చాలని స్టడీ తెలుపుతోంది. కివి పండు శ్వాస సంబంధిత ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది. కనీసం వారానికి ఒకసారి చిన్న పిల్లలకు తినని వారికంటే 44 శాతం తక్కువ దగ్గు జలుబు సమస్యలకు గురయ్యారని తెలుపుతోంది.

అరటి పండులో ఎంత పొటాషియం ఉందో అంత కివి పండులో ఉంటుంది. అరటి పండుతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ ఉండడంతో గుండెకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సోడియం లెవెల్స్ కూడా తక్కువే. సోడియం రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలలో కొవ్వులు కూడా అధికం అని మనకి తెలుసు. కాని కివి పండులో తక్కువ కొవ్వు శాతంతో విటమిన్ డి లభిస్తుంది. అధిక యాంటీ ఆక్సిడెంట్లను అందించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కివి పండులో పోలిక్ యాసిడ్ అధికం. గర్భవతి మహిళలు దీన్ని తీసుకుంటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పోలిక్ యాసిడ్ బేబీలలో నరాల బలహీనత రాకుండా చేస్తాయి. గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లను కూడా అందిస్తుంది. బేబీ ఎదుగుదలలో మెదడు పెరిగేలా చేస్తుంది గుండె జబ్బులనుండి కాపాడుతుంది.

ఈ పండులో పీచు కూడా అధికంగా ఉంది జీర్ణవ్యవస్థను శుభ్రం చేసి మలబద్ధకం లేకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది గుండెజబ్బులు అన్ని రకాల క్యాన్సర్లను అరికడుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలను తగ్గించి డయాబెటిస్ రాకుండా చేస్తుంది.

కివి పండు కడుపు నింపుతుంది దీనివల్ల బరువు కూడా తగ్గిస్తుంది. కివి పండులో ఉండే జింక్ శాతం పురుషుల్లో టెస్టోస్టిరాన్ శాతాన్ని పెంచుతుంది. చర్మం వెంట్రుకలు పళ్ళు కోళ్లు మొదలైన వాటి ఆరోగ్యకరమైన  పెరుగుదలకు జింక్ సహకరిస్తుంది. కివి పండు మన దేశానిది కాదు అయినప్పటికీ దీని పోషకాల దృష్ట్యా దీన్ని ఎక్కడినుండైనా తెప్పించి తినొచ్చు.

పండు సైజు గురించి ఆలోచించకండి దీని ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కివి పండు ఎలా ఎంపిక చేయాలంటే మీ బొటన వేలితో కివి పండును వత్తండి  అది పండితే కొంచెం మెత్తగా ఉంటుంది తినడానికి అనువుగా ఉంటుంది. ఇప్పుడైతే దాదాపు అన్ని సూపర్ మార్కెట్ లలో మనకు ఇది లభిస్తుంది. ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కివి పండుని తిని ఆనందంగా ఉండండి.

2 thoughts on “ఈ పండుతో సమస్యలన్నీ దూరం”

Leave a Comment

error: Content is protected !!