కళ్ళను తనవైపు తిప్పుకుని ఆకర్షించే కూరగాయలు బోలెడు ఉంటాయి. ఇది కూడా ఒకరకరకమైన మిర్చి కానీ కారం మాత్రం ఉండదు. ఖరీదైన వంటకాల్లో మిసమిసలాడుతూ ఉంటుంది. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభ్యమయ్యే దీన్ని క్యాప్సికం అని పిలిచినా. బెంగుళూరు మిర్చి, సిమ్లా మిర్చి, బెల్ పెప్పర్ అంటూ బోలెడు నామకరణాలు చేశారు దీనికి. అసలు ఈ క్యాప్సికం గూర్చి మీకు నిజం తెలిస్తే ఇక ఇష్టంగా తినేస్తారు. కావాలంటే మీరే చూడండి ఈ కాప్సికంలో ఎన్ని పోషకాలు ఉన్నాయో.
విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, ఫైబర్, కేరోటినాయిడ్స్ మొదలైనవి పుష్కలంగా లభించే క్యాప్సికం తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్. రండి మరి క్యాప్సికం ను లోతుగా వివరాలు తెల్సుకుందాం.
◆కాప్సికంలో విటమిన్-సి సమృద్ధిగా ఉంటుంది. ఇది కొల్లజన్ ఉత్పత్తిని పెంచుతుంది. మన ఎముకల మధ్య జాయింట్స్ అనగా కీళ్ళకు అవసరమయ్యే విటిక్మిన్-కె ను అందించి రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తకణాలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
◆మన కళ్ళ ఆరోగ్యానికి విటమిన్-ఎ ఎంతో అవసరం. అలాంటి విటమిన్ ఎ కాప్సికంలో పుష్కలంగా లభ్యమవుతుంది. ఇది రేచీకటి సమస్యను నివారిస్తుంది. క్యాప్సికం ను రోజు తినడం వల్ల ఇందులోని కెరోటినాయిడ్స్ వయసు రీత్యా వచ్చే దృష్టిలోపాలను తగ్గిస్తుంది. ఐ కాంటరాక్ట్ కు వ్యతిరేకంగా మంచి ఏజెంట్ గా పనిచేస్తుంది.
◆ఎరుపు రంగు కాప్సికంలో లైకోపిన్ అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులోని బి6 మరియు ఫోలేట్ గుండెకు హాని కలిగించే హీమోసైటనిన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
◆కాప్సికంలో ఫైబర్ పాళ్లు అధికంగా ఉంటాయి. ఇది జీర్ణశక్తి సామర్త్యాన్ని పెంచి, గ్యాస్ సమస్యలను, కడుపు అల్సర్ లను, కడుపులో వికారం వంటి వాటిని నివారిస్తుంది.
◆వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో క్యాప్సికం అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
◆మనం తీసుకునే ఆహారం నుండి ఐరన్ ను సులువుగా గ్రహించడంలో క్యాప్సికం దోహదం చేస్తుంది. అనిమియా సమస్యతో బాధపడేవారు క్యాప్సికం ను ఆహారంలో భాగం చేసుకుంటే తొందరగా సమస్య నుండి బయటపడచ్చు.
◆యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇంప్లమేటరీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల క్యాన్సర్ కారక కణాలతో సమర్థవంతంగా పోరాడి కాన్సర్ ను దూరంగా ఉంచుతుంది.
◆రక్తంలో చెక్కెర స్థాయిలు క్రమబద్దీకరించి మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది.
చివరగా…..
క్యాప్సికం ను కూరలలోనే కాకుండా పచ్చిది కూడా సలాడ్లలో ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న గొప్ప గుణం పరిమితంగా పండులగా పచ్చిది కూడా తినవచ్చు.