you must know real facts about dryfruits

డ్రై ఫ్రూట్స్ తినే ప్రతిఒక్కరూ ఒక్కసారి ఈ వీడియో చూడండి మీ శరీరంలో ఏం జరుగుతుందో తెరిస్తే షాక్…!

పిల్లలు త్వరగా నీరసంతో బాధపడుతుంటే, త్వరగా అలసిపోతున్నపుడు , బక్కగా పీలగా ఉంటున్నా  అందరూ ఆలోచించేది మార్కెట్లో దొరికే హెల్త్ డ్రింకుల గురించి. పిల్లల్లో ఎదుగుదలకోసం, మానసిక వికాసానికి వీటిపై ఆధారపడడం ఎక్కువయిన తరుణంలో వాటి గురించి నిజాలు, దుష్ప్రభావాలు తెలిసి ప్రత్యామ్నాయ మార్గాలను చూస్తుంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ పౌడర్ మీ ఆకాంక్షలను ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీర్చుతుంది. దీనికోసం ఐదురకాల డ్రైప్రూట్స్ తీసుకోవాలి.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

 వాల్ నట్స్, జీడిపప్పు, పల్లీలు, పిస్తా‌, బాదంపప్పులు అన్నిటినీ పావుకప్పు కొలతలో తీసుకోవాలి. వాల్నట్స్ తీసుకుని తక్కువ మంటపై డ్రై రోస్ట్ చేయాలి. ఎక్కువ మంటపై వేయిస్తే ఇందులో ఉండే నూనెలు, పోషకాలు తగ్గిపోతాయి. అందుకే అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా వేయించుకోవాలి. వాల్నట్స్ తర్వాత జీడిపప్పు, పిస్తా‌, పల్లీలు, బాదంపప్పులను వేసుకోవాలి. తక్కువ మంటపై కొద్దిసేపు వేయించి చల్లార్చుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీపట్టాలి. వేడిమీద చేస్తే నూనెలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

 ఇలా మిక్సీపట్టిన ఈ పౌడర్ పొడిపొడిగా వస్తుంది. దీనిని గాలిచొరబడని డబ్బాలో నిలవచేసుకోవచ్చు. ఫ్రిజ్ లో పెడితే ఇంకా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇందులో మాంసం, గుడ్లకంటే  ఆరురెట్లు ఎక్కువ కేలరీలు ఉంటాయి. ప్రొటిన్ అధికంగా లభిస్తుంది. ఒకగ్లాసు పాలల్లో రెండు స్పూన్ల పౌడర్ వేసుకుని మరిగించి తాగొచ్చు. లేదా స్మూతీలు, పండ్లరసాలలో కలిపి తాగొచ్చు. ఇది పిల్లలు, పెద్దలకు కూడా చాలా మంచిది. 

దీనివలన జ్ఞాపక శక్తి పెరగడం, జుట్టు రాలడం తగ్గడం, ముఖంపై ముడతలు తగ్గడం, కీళ్ళనొప్పులు, అలసట, నీరసం తగ్గి ఉత్సాహంగా అవ్వడానికి ఈ పౌడర్ ఉపయోగపడుతుంది. దీంట్లో అనేక మాంసకృత్తులు, విటమిన్లు, ప్రొటీన్లు దొరుకుతాయి.  ఈ పాలపౌడర్లో కెమికల్స్ ఏమీలేకపోవడం వలన దుష్ప్రభావాలు ఉండవు. ఏదైనా అతి అనర్థదాయకం కనుక మితంగా తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు. డ్రైప్రూట్స్ అధికంగా తీసుకుంటే బరువుపెరుగుతుంది కనుక అధికబరువు ఉన్నవారు  తక్కువగా ఉపయోగించాలి.

Leave a Comment

error: Content is protected !!