you must know what small baby did in hospital viral video

నాలుగేళ్ల పాప చనిపోతూ ఏం చేసిందో చూసి డాక్టర్లు సైతం కన్నీరు పెట్టారు

తల్లిదండ్రుల ప్రేమ ఎంత గొప్పది అంటే తమ బిడ్డ చనిపోతుంది అంటే తమ ప్రాణం పోయినట్టు బాధపడుతుంటారు. అలాంటిది చనిపోయిన తమ బిడ్డ లేచి ఐలవ్యూ చెప్పి తిరిగి చనిపోతే అది ఎంత కష్టంగా ఉంటుందో చెప్పలేము. అలాంటి సంఘటనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నాలుగున్నరేళ్ల లైలా అనే పాప చిన్నతనం నుంచి అనేక అనారోగ్యాలకు గురి అవుతుంది. ఎన్ని రకాల మందులు వాడినా ఆమెకు నయం కావడం లేదు. అందుకని ఆమెను పెద్ద హాస్పిటల్లో చూపిస్తే ఆమెకు తీవ్ర అనారోగ్యం ఉందని ఎక్కువ రోజులు బ్రతకదని డాక్టర్లు చెప్పారు. హాస్పిటల్లోనే ఉంచి చికిత్స చేయాలని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

 తమకు ఉన్నదంతా అమ్మాయినా సరే తమ బిడ్డను కాపాడుకోవాలని నిర్ణయించుకొని అలాగే డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డను చికిత్స చేయిస్తున్నారు. కొన్ని రోజులకు ఆ పాప హాస్పిటల్లో ఉండే డాక్టర్లు, నర్సులకు కూడా చాలా ఇష్టంగా మారిపోయింది. ఆ పాప చేసే అల్లరి, చిలిపి చేష్టలు హాస్పిటల్లో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. పాపకి నయమైందని కొద్ది రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చని డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రుల ఆనందానికి అంతులేకుండా పోయింది. అయితే మనుషులు కోరిన దానికి విరుద్ధంగా చేయడం భగవంతుడికి ఇష్టం అనుకుంటా. 

నయమైంది అనుకున్న కూతురికి మళ్లీ అనారోగ్యం తిరగబెట్టింది. డాక్టర్లు పరీక్షలు చేసి ఈసారి ఆమెకి లంగ్ క్యాన్సర్ వచ్చిందని స్పష్టం చేశారు. అంత చిన్న పాపకి క్యాన్సర్ చికిత్స చేయడం ప్రమాదమని, తట్టుకోలేదని చెప్పడంతో తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు. ఉన్నన్ని రోజులు ఆమెకు నచ్చిన ప్రదేశాలకు తీసుకువెళుతూ, నచ్చినవన్నీ ఇవ్వడం మొదలు పెట్టారు.

 పాప చాలా ఆనందంగా ఉండేది. ఒక రోజు ఆమె తల్లి స్నానం చేస్తుండగా లైలా కళ్లు తిరిగి పడిపోయింది. లైలా తల్లి వచ్చి ఆమెని చూసి పిలుస్తూ ఆమె పరిస్థితి చూసి మరణించిందని అర్థం చేసుకొని ఏడవడం మొదలుపెట్టింది. అయితే అప్పుడే ఆమె ఊహించని సంఘటన జరిగింది  కొన్ని సెకండ్ల తరువాత లైలా కళ్ళు తెరిచింది. తల్లితో ఐ లవ్ యు మా అని ఒక మాట చెప్పి కళ్ళు మూసుకుంది. అయితే ఈ సారి ఆమె తిరిగి లేవలేదు. తన కూతురు చనిపోయేటపుడు కూడా తనపై ప్రేమ చెప్పడానికి కళ్ళు తెరవడం చూసి ఆ తల్లి ఆశ్చర్యంతో ఉండిపోయింది. 

ఆమె అంత్యక్రియలకు ఎవరు ఏడవకూడదని, సంతోషంగా ఆమె అంత్యక్రియలు చేయాలనికోరడంతో లైలా బంధువులు కూడా నవ్వుతూ ఆమె అంత్యక్రియలు చేశారు. అయితే తమ కూతురు అంత్యక్రియల్లో అందరూ నవ్వుతూ ఉండడం ఆ తల్లిదండ్రులు ఎలా భరించారో ఏమో. లైలా తల్లి చెప్పిన తరువాత నాలుగున్నర ఏళ్ళ పాప ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. తల్లి పై ఉన్న ప్రేమని చెప్పడానికి మరణంలో కూడా కళ్ళు తెరిచిన లైలా ఆత్మ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

Leave a Comment

error: Content is protected !!