కొబ్బరికి కొలెస్ట్రాల్ కి అసలు సంబంధమే లేదు. చాలామంది కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుందని దానిని తినడమే మానేస్తారు. కొబ్బరిలో కొలెస్ట్రాల్ అనేది జీరో. ఏ వృక్ష సంబంధ ఆహారాల్లోనూ కొలెస్ట్రాల్ అనేది ఉండదు. దీన్ని సైంటిఫిక్ గా వృక్ష సంబంధమైన వాటిలో కొలెస్ట్రాల్ ఉండదని న్యూట్రిషన్ వారు సర్వే ప్రకారం నిరూపించడం జరిగింది. కొబ్బరిని ఎక్కువగా తినే రాష్ట్రం కేరళ. కాని ఇండియా మొత్తం మీద అతి తక్కువ గుండె జబ్బులు ఉన్న మొదటి రాష్ట్రం కేరళ. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే దాన్ని, బలాన్ని ఇచ్చే దాన్ని భయంతో తినడం మానేసి దూరం అవుతున్నాం. మరి అలాంటి కొబ్బరి అనేది మానవాళికి చాలా ఉపయోగకరం.
దీనిలో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ కొబ్బరి అనేది మేధాశక్తికి, తెలివితేటలు కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని సైంటిఫిక్ గా కూడా నిరూపించడం జరిగింది. కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఈ కొబ్బరిలో యాంటీ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ యాంటీ కొలెస్ట్రాల్ అనేది వెళ్లి LDL అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ను క్లీన్ చేస్తాయని కేరళ సైంటిస్టులు సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. అందువల్ల గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అందుకని సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా ఉంది. కాబట్టి ఈ కొబ్బరిని గురించి ఏనాడో మన ఋషులు చెప్పిన సంస్కృతి లో ఉంది.ఈ కొబ్బరిని ప్రతి శుభకార్యం లో కొట్టి నలుగురికి పంచమన్నారు, నలుగురిని తినమన్నారు.
ఎందుకు అంటే మేధాశక్తి కి, తెలివితేటలకి కొబ్బరి ని మించిన ఆహారం ఇంకొకటి లేదు. ఆధునిక జీవన శైలిలో నిద్రలేమి అనేది చాలామంది కనిపిస్తూ ఉంటుంది అందుకని పడుకునే ముందు పచ్చి కొబ్బరిని తింటే నిద్ర బాగా పడుతుంది. అంతేకాకుండా చర్మం మీద ఉన్న మొటిమలు మచ్చలు కూడా ఈ పచ్చి కొబ్బరి ని తినడం ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ కొబ్బరిని రోజు తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన అంత శక్తి లభిస్తుంది. ఈ కొబ్బరి అనేది శరీరంలో నీటి శాతాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని మంచిగా తినవచ్చు.
ఇది డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ లో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ కొబ్బరి తినడం వల్ల చాలా ఆరోగ్యంగాను మరియు బలంగాను ఉండవచ్చు. దీనివల్ల ఎటువంటి హాని కలగదు.