వంటల్లో ఉప్పులేని చప్పదనాన్ని పోగొట్టడానికి చిలకడదుంప బాగా ఉపయోగపడుతుంది. అరటికాయ చప్పగా ఉంటుంది. చిలకడదుంప తియ్యగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే ఉప్పులేని చప్పదనాన్ని ఇవి రెండూ తగ్గిస్తాయి. కనుక ఈ రెండింటి కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉప్పులేని చప్పదనాన్ని తగ్గిస్తూ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. ఇవి మనకు ఆరోగ్యాన్ని కలిగించడంతోపాటు చాలా రుచికరంగా కూడా ఉంటుంది. దాని పేరు స్వీట్ పొటాటో అరటికాయ వడ. ఈ వడలు సాధారణ వడలు వలె క్రిస్పీగాను, టేస్టీ గాను ఉంటాయి.
ఈ చిలకడదుంప అరటికాయ వడలు తయారు చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు రెండు అరటికాయలు, రెండు చిలకల దుంపలు, నానబెట్టిన పచ్చి శనగపప్పు ఒక కప్పు, క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, వాము ఒక టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు రెసిపీ తయారు చేసుకునే పద్ధతి నేర్చుకుందాం. ముందుగా ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అరటికాయను, చిలకడ దుంప ముక్కలుగా చేసి వేసుకోవాలి.
ఇప్పుడు వాటిని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన ప్రతి శనగపప్పు 60 శాతం వేసుకొని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర కొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చిలకడ దుంప, అరటికాయ తొక్కలు తీసి ఒక గిన్నెలో వేసుకొని పప్పు గుత్తి సహాయంతో మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న పచ్చిశనగపప్పు, కరివేపాకు పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి.
పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత క్యారెట్ తురుము, కొత్తిమీర, వాము, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన వడలిపిండిని వడలుగా చేసుకొని నాన్ స్టిక్ పాన్ పై వేసుకొని కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మీగడ రాసీ మరొకవైపు కాలనివ్వాలి. ఇలా మన టేస్టీ చిలకడదుంప, అరటికాయ వడలు తయారయిపోతాయి. నూనె లేకుండా ఇలా కాల్చుకున్న వడలు కూడా నూనె వేయించిన విధంగా మంచి టేస్టీగా ఉంటాయి…