10 best tips to prevent and treat hemorrhoids at home

మొలల సమస్యను సులువుగా జయించే టాప్ 10 టిప్స్

ఈమధ్యన తరచుగా వింటున్న సమస్య మొలలు. వీటిని వైద్యపరిబాషలో పైల్స్ అంటారు. మాలద్వారం దగ్గర రక్తనాళాలు ఉబ్బిపోయి మలవిసర్జనకు ఆటంకం కలిగిస్తూ నొప్పిని బాధను కలిగిస్తాయి.  మనం తీసుకునే ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం అనే సమస్య వల్ల మలబద్దకం సంభవిస్తుంది. హార్మోన్ సమస్యలు మొలలకు మూలకారణమని కొందరి అభిప్రాయం. స్త్రీలలో గర్భకోశం విస్తరించడం వల్ల ఒత్తిడి పెరిగి మొలల సమస్యకు కారణం అవుతుంది. జీర్ణక్రియ సరిగా పని చేయకపోవడం వల్ల సంభవించే మలబద్దకం కూడా మొలలు సమస్య రావడానికి కారణం అవుతుంది. ఆపరేషన్ తప్ప మార్గం లేదనుకునే ఈ సమస్యకు చక్కటి చిట్కాలతో పరిష్కారం సాద్యమని పెద్దల మాట. అవేంటో ఒకసారి చూద్దామా…..

తమలపాకు తాంబూలం గా పండుగలలో విరివిగా వాడతారు అలాంటి తమలపాకు ఉపయోగించి మొలలకు మంచి చిట్కా. తమలపాకులకు ఆముదం రాసి దానిని వెచ్చ చేసి పడుకునే ముందు మొలలు వచ్చిన చోట కట్టులా కట్టాలి. దీనివల్ల మొలలు తగ్గుముఖం పడతాయి.

క్యాబేజి గొప్ప రోగనిరోధక శక్తిని కలుగచేస్తుందని అందరికి తెలిసినదే. అలాంటి క్యాబేజీ ని రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మొలలు సమస్య ఆమడదూరంలో ఉంటుంది.

◆చేదుగా ఉన్న పుచ్చకాయ చెట్టును వెదికి ఆ చెట్టు వేరును అరగదీసి మొలలపైన లేపనం చేయాలి. దీనివల్ల మొలలు వాపు, నొప్పి తగ్గిపోతాయి

అడవి కందగడ్డను తీసుకుని దానిని ఉడికించి రొట్టెలాగా చేసి కాల్చుకుని నేతితో తినాలి. ఇలా చేయడం వల్ల మొలల సమస్య పరిష్కారం అవుతుంది

కాకరకాయ లేదా కాకర ఆకుల రసం ను చెక్కరతో కలిపి తీసుకోవాలి దీనివల్ల రక్తాన్ని స్రవించే మొలలు కూడా తగ్గిపోతాయి

◆ప్రతిరోజు భోజనం ముగిసిన తరువాత అరస్పూన్ కరక్కాయ చూర్ణం ను గ్లాసుడు పుల్ల మజ్జిగలో కలిపి తాగాలి. దీనివల్ల మొలల వ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది.

వాము పసుపు సమానాభాగాలు గా తీసుకోవాలి. వీటిని బాగా నూరి మొలల మీద లేపనం చేయాలి. దీనివల్ల మొలలు రాలిపడిపోతాయి.

ఉల్లిపాయలను  నేతితో వేయించి  అందులో పంచదారను చేర్చి రోజా రెండు పూటలా మొలల సమస్య తీరేవరకు తినాలి. దీనివల్ల మరొకసారి మొలల ఇబ్బంది దరిదాపుల్లోకి రాదు.

క్యాబేజీ ని మెత్తగా నూరి దాన్ని చిన్న బిల్లలుగా చేసి మొలలు ఉన్న ప్రాంతం లో వేసి  కట్టు కట్టాలి. దీనివల్ల సమస్య తొందరగా పరిష్కారం అవుతుంది.

ముల్లంగి దుంపలను రసం తీసి ఆ రసాన్ని రోజు కొద్దిగా తీసుకుంటూ క్రమంగా మోతాదు పెంచాలి దీనివల్ల మొలల సమస్య తగ్గిపోతుంది.

దానిమ్మ తొక్కలను నీళ్లలో వేసి ఉడికించి కషాయం చేసుకుని రోజుకు రెండుపూటలా తాగడం వలన కూడా మొలలు తగ్గిపోతాయి.

చివరగా…….

పరిష్కారాలు ఎన్ని ఉన్నా మొలల సమస్యకు కారణం మలబద్దకం కాబట్టి మనం తీసుకునే ఆహారంలో పీచు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడటం వల్ల సమస్యను రాకుండా చూసుకోవడమూ, లేదా సమస్యను అధిగమించడమూ సులువు అవుతుంది.

1 thought on “మొలల సమస్యను సులువుగా జయించే టాప్ 10 టిప్స్”

Leave a Comment

error: Content is protected !!