పిల్లలు ఆడుతూ పాడుతూ కాలం తో పాటు పెద్దవాళ్లవుతుంటే తల్లిదండ్రుల సంతోషం వర్ణనాతీతం. అయితే పెద్దవాళ్ళు అవుతుంటేనే కాదు దానికి తగ్గట్టు లావు, ఎత్తు లేకపోతే తల్లిదండ్రులు బెంగ పడిపోతారు. తల్లిదండ్రులు శారీరకంగా పొడవు ఉన్నా వారి పిల్లలు కొందరు పొడవు పెరగరు. మరికొందరు తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నా కొందరు పొడవు పెరిగిపోతారు. అందుకే మరి పొడవు పెరగం అనేది కేవలం జన్యువుల వల్ల సంభవించేది కాదు. అయితే మరి ఎలా అని మీకు అనిపిస్తుందా?? ఒక్కసారి మా సలహాలు పాటించి చూడండి.
పొడవు పెరగడానికి ఆహారం తో పాటు ఆరోగ్యకరమైన పద్ధతులు కూడా సానుకులతను ఇస్తాయి. అవేంటో చూద్దాం.
ఆహారం
సాధారణంగా పిల్లలు బాల్య దశ దాటి కౌమార దశలోకి వచ్చినప్పటి నుండి టీనేజ్ వరకు పొడవు పెరుగుతారు. అయితే ఆ సమయంలో కూడా తగినంత పొడవు పెరగకపోతే వారిలో పొడవు పెరగడానికి దోహదం చేసే హార్మోన్స్ విడుదల కాలేదని గుర్తించాలి. ఈ హార్మోన్స్ ను వృద్ధి చేయడానికి ఆహారంలో మార్పులు చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఆ ఆహారం ఏంటో చూద్దాం ఒకసారి.

క్యారెట్
సాధారణంగా వంటల్లో వాడే క్యారెట్ లో పొడవు పెరగడానికి దోహదం చేసే హార్మోన్స్ ను అభివృద్ధి చేసే గుణం ఉంటుంది. అందువల్ల రోజు ఒక పచ్చి క్యారెట్ ను పిల్లలచేత తినిపించడం వల్ల పలితం ఉంటుంది.

బీన్స్
బీన్స్ లో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి పొడవు పెరగటానికి ఎంతగానో తోడ్పడతాయి. వీటిని ఆహారంలో భాగంగా వండి పెట్టాలి.
బెండకాయ
సాదారణంగా పెద్దలు చెప్పే మాట వెండకాయ తింటే పిల్లల్లో తెలివి పెరుగుతుందని. అయితే రోజువారీ ఆహారంలో బెండకాయని భాగం చేయడం వల్ల బెండకాయలో ఫైబర్ ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది.
బఠాణి
బఠాణీలలో ఫైబర్, ప్రోటీన్స్ శరీరాన్ని దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. అలాగే ఇది శరీరాన్ని బరువు పెరగనివ్వదు. శారీరక ఎదుగుదలకు బఠాని ఎంతో ఉపయోగకారి.
అరటిపండు
చాలామంది లావు అవుతామనే కారణంతో అరటిపండుకు దూరంగా ఉంటారు. అయితే రోజు అరటిపండు తీసుకోవడం వల్ల అందులో పొటాషియం, కాల్షియం ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది.

సోయాబీన్
సోయాబీన్ లో అధికంగా కార్బోహైడ్రేట్ లు ఉంటాయి ఇవి శరీరంలో ఎముకల పెరుగుదలకు తోడ్పడతాయి. అంతే కాకుండా ఎముకలకు బలాన్ని చేకూర్చుతాయి.
పాలు
పాలు పెరిగే పిల్లలకు గొప్ప ఔషధం. ఇందులో కాల్షియం వల్ల ఎముకలకు బలం చేకూరటం తో పాటు ఆరోగ్యవంతమైన ఎదుగుదల పిల్లల సొంతమవుతుంది.
గుడ్లు
గుడ్లలో ఉన్న కాల్షియం పిల్లల శరీరంలో ఎత్తు పెరగడానికి అవసరమైన హార్మోన్స్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యము ఉంటుంది అందుకే పిల్లలకు రోజుకు ఒక గుడ్డు పెట్టడం మంచిదని నిపుణుల సూచన
మరో ముఖ్యమైన విషయం
ఇప్పటికాలం లో పిల్లలు ఉదయం స్కూల్ కు వెళ్లడం, అక్కడి నుండి ట్యూషన్ లు తరువాత రాత్రి ఎపుడో ఇంటికి చేరి కాసింత తిని పడుకుంటారు. దీనివల్ల పిల్లల శరీరానికి తగిన సాధన లేకపోవడం వల్ల ఎత్తు పెరగడం లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఎదిగే వయసు పిల్లలను బయట ఆటల్లో లీనం చేయడం వల్ల శారీరక దృఢత్వం తో పాటు పొడవు కూడా పెరుగుతారు