మీ గురించి చాలా మంది గమనించే మొదటి విషయం మీ దంతాలు. మీరు మాట్లాడేటప్పుడు, నవ్వినప్పుడు మీ దంతాలు ఎల్లప్పుడూ ఎదుటివారి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇది మీ వ్యక్తిగత పరిశుభ్రతపై అంతర్దృష్టిని అందిస్తుంది మరియు ఇతరులు మీ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచడంలో ప్రధాన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితిలో, పసుపు దంతాలు మరియు నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మనలో చాలా మంది రోజూ రెండుసార్లు పళ్ళు స్క్రబ్ మరియు ఫ్లాస్ చేస్తుంటారు, కానీ మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సరిపోదు. కొంతమంది రెండు పూట్లా బ్రష్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కేవలం ఉదయం బ్రష్ చేసి రాత్రిపూట చేయడం మానేస్తారు.
కానీ దీని వలన మనం రాత్రి తీసుకొనే ఆహారాలు పళ్లపై చిక్కుకొని బ్యాక్టీరియా తయారవుతుంది. ఈ బ్యాక్టీరియా నోటిదుర్వాసన, దంతక్షయం, చిగుళ్ల వాపు వంటి అనేక నోటి సమస్యలకు కారణం అవుతుంది. అయితే మెరిసే దంతాలు మరియు దృఢమైన చిగుళ్ల కోసం మీరు మీ ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, మొక్కజొన్న, డ్రై ఫ్రూట్స్ వంటి ఉడికించకుండానే తినగలిగే ఆహారాలు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల లోపు లేదా ఎనిమిది గంటలకు తర్వాత అయినా నాచురల్ ఫుడ్స్ తీసుకునేవారిలో పండ్లు, డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ పళ్ళను స్క్రబ్ చేసి శుభ్రం చేస్తుంది.
సహజ పదార్థాలు తీసుకొనే జంతువులలో పంటి సమస్యలు ఎవరూ చూసి ఉండరు. దానికి కారణం సహజంగా తీసుకునే పచ్చి ఆహారాలు పళ్లకు అంటుకోవు. మనం తినే ఆహారాలు 90% ఉడికించినవే తీసుకుంటాం. ఇవి పళ్ళ మధ్య చిక్కుకొని పంటి సమస్యలకు కారణం అవుతుంటాయి. సాయంత్రం ఆరు గంటల లోపు నాలుగైదు రకాల పండ్ల ముక్కలు లేదా సలాడ్ లేదా ఎండు విత్తనాలు తీసుకునే వారిలో ఈ సమస్యలు సహజంగా నివారించబడతాయి. రాత్రి పూట కూడా బ్రష్ చేయడం పంటి ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయ పడుతుంది. కేవలం పుక్కిలించడం వలన పళ్లపై ఏర్పడే బ్యాక్టీరియాను అరికట్టలేం.