12 Habits That Damage Your Health

ఈ పనులు చేస్తున్నారా.అయితే జాగ్రత్త సుమా !

మనకు తెలియకుండానే మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. అలా మనం చేసే తప్పులు మన జీవితాన్ని ప్రమాదంలో పడేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి గురించి మనం చేసే తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది తిన్నవెంటనే బ్రష్ చేయడం చాలా మంచిదని అనుకుంటారు. కానీ మనం తిన్న వెంటనే మనం తిన్న ఆహారం లోని పదార్థాలు భాగాలు పళ్లపై యాసిడ్స్ రిలీజ్ చేస్తాయి. ఇలా చేసినప్పుడు ఎనామిల్  కొంచెం వీక్ అవుతుంది. దీనివలన పళ్ళు ఎర్రగా తయారవుతాయి. బ్రష్ ఉదయం లేచిన వెంటనే మరియు పడుకోవడానికి ముందు మాత్రమే చేయాలి. 

ఎక్కువగా వ్యాయామం చేయకూడదు. మనం రోజూ వ్యాయామం చేయడం వలన మన శరీరంలో సగం వ్యాధులు మనకు తెలియకుండానే తగ్గిపోతాయి. కానీ అదే పనిగా వ్యాయామం చేయడం వలన శరీర అవయవాలపైన ఒత్తిడి పెరిగి అనేక రకాల సమస్యలు వస్తాయి. అలా చేయడం వల్ల గుండెకు చాలా ప్రమాదం. అలాగే వ్యాయామం చేయడం తప్పు అని కాదు. సరైన ఆహారం తీసుకుంటూ శరీరానికి తగిన వ్యాయామం చేయడం  మంచిది.

 కొంతమంది పడుకుంటే అసలు నిద్ర లేవరు కొంతమంది మాత్రం ప్రతి చిన్న విషయానికి కూడా ఉలిక్కిపడిలేస్తూ ఉంటారు. బాత్ రూమ్ కి వెళ్లడానికి లేవడంలో తప్పులేదు. కానీ నిద్దట్లో సడన్గా ఉలిక్కిపడి లేవడం అంత మంచిది కాదు. అలా లేచినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉండదు. గుండె కూడా చాలా వీక్ గా ఉంటుంది. అలా జరిగినప్పుడు ఒక్కోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. నిద్రలో మెలుకువ వచ్చినప్పుడు వెంటనే తుళ్ళి పడకుండా ఒక నిమిషం ఆగిలేవడం వల్ల బ్రెయిన్ యాక్టివేట్ అయి స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

 ఫోన్ వాకింగ్ అంటే ఫోన్ పట్టుకొని రోడ్లపైన నడవడం. ఇది చాలా ప్రమాదకరం. ప్రతి సంవత్సరం పదకొండు వందల మంది ఫోన్ వాడుతూ రోడ్లపై నడవటం వలన చనిపోతున్నారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడడం కూడా మంచిది కాదు.

 మనకు దెబ్బ తగిలినప్పుడు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం. ఆ దెబ్బ ఎముకలకు తగిలి నొప్పి వస్తుంటే పెయిన్ కిల్లర్స్ అసలు వాడకూడదు. పెయిన్ కిల్లర్ యూస్ చేస్తే విరిగిన ఎముక తిరిగి అతుక్కోదు. మనకు దెబ్బ తగిలినప్పుడు శరీరం ఆ సూచనలను మెదడుకు అందిస్తుంది. పెయిన్ కిల్లర్స్ వేసుకున్నప్పుడు ఆ సూచనలు మెదడుకు చేరకుండా అడ్డుకుంటుంది. నొప్పిని మెదడుకు చేరకుండా అడ్డుకోవడం వల్ల ఎముక తిరిగి అతుక్కోవడానికి శరీరం సహకరించదు.

 చాలా మంది ఎక్కువ సేపు స్నానం చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన చర్మంపై ఉండే సన్నటి పొర కరిగిపోతుంది. దీని వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే తక్కువ సమయంలో స్నానం చేయడం మంచిది. ఒత్తిడి వల్ల జుట్టు రాలుతుంటే అది గమనించి మరింత ఒత్తిడికి గురవుతుంటారు. దీని వల్ల జుట్టు రాలడం తప్ప ఫలితం ఉండదు. అందుకే ఒత్తిడిని తగ్గించుకుంటే రాలిన జుట్టు తిరిగి పెరుగుతుంది. 

ఫోన్ చార్జింగ్ పెట్టి యూస్ చేయడం కూడా అంత మంచి పని కాదు ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి యూస్ చేయడం వలన అది ఎక్కువ పవర్ తీసుకోవాల్సి ఉంటుంది. దానివలన బ్యాటరీ ఎక్కువ వేడికి పేలిపోయే అవకాశం ఉంది.

 తలనొప్పి వచ్చినప్పుడు పెయిన్ బామ్ ఎక్కువ యూస్ చేయకూడదు. దీనివలన దానికి ఎడిక్ట్ అయిపోయి చిన్న చిన్న వాటికి కూడా రాస్తూ ఉంటాం. అలా కాకుండా తలనొప్పి వచ్చినప్పుడు ఒక మంచి టీ తాగడం, ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవడం వలన తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!