అందరికీ జుట్టు రాలే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతమున్న వాతావరణ పరిస్థితుల మనం తీసుకునే ఆహారం వల్ల కూడా జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల నూనెలు వస్తున్నాయి కానీ వాటిని వాడటం వలన డబ్బు వృధా అవడం తప్ప ఫలితం కనిపించదు. మనం ఇంట్లోనే నూనె తయారు చేసుకునే రాసుకున్నట్లు అయితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ నూనె తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు కొబ్బరి నూనె, చిన్న ఉల్లిపాయలు, మెంతులు, కలబంద.
నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పావు కేజీ ఉల్లిపాయలు తీసుకొని తొక్కలు తీసి శుభ్రంగా కడుక్కోవాలి. ఉల్లిపాయలను మిక్సీ జార్ లో వేసుకొని 50 గ్రాముల మెంతులను కూడా వేసుకోవాలి. దీనిలో రెండు కలబంద మట్టలను శుభ్రంగా కడిగి అంచులను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోవాలి. వీటన్నింటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఇనుప కడాయి పెట్టుకుని రెండు కప్పులు కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె బయట కొన్నది కాకుండా గానుగ నుండి తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసుకోవాలి.
కొబ్బరి నూనె లో ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి లో ఫ్లేమ్ లో పెట్టి నూనెను బాగా మరగనివ్వాలి. ఆనియన్ పేస్ట్ లో ఉన్న నీరు అంతా ఆవిరయిపోయి నూనె మాత్రమే మిగిలేలా మరిగించుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నూనె చల్లార్చుకోవాలి. నూనె చల్లారిన తర్వాత వడకట్టుకొని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. నూనె రాసుకున్నప్పుడు కొంచెం తీసుకొని వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు అప్లై చేసి పది నిమిషాలు మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ బాగుంటుంది. నూనెను అప్లై చేసిన తర్వాత కనీసం రెండు మూడు గంటలపాటు ఉంచి ఆ తర్వాత తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హెర్బల్ షాంపూ తో చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల రాలిన జుట్టు మొత్తం తిరిగి వస్తుంది. 15 రోజుల్లో తేడా మీరే గమనిస్తారు. ఈ నూనెను మీరు కూడా తయారు చేసుకొని జుట్టు ఒత్తుగా పడవ పెరిగేలా చేసుకోండి.