2 min face glow beauty tip

రాత్రిపూట ఇది రాస్తే చాలు మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు.. fairness

ఇప్పటిరోజుల్లో బయటకు వస్తే చాలు. చుట్టూ వాహనాల వలన  పెరిగిపోతున్న వాయు కాలుష్యం, తినే ఆహారంలో పెరిగిన నూనె, ఫాస్ట్ ఫుడ్,  మాంసాహారం, మైదా సంబంధిత పదార్థాలు వాడకం ఎక్కువయిపోయింది. ఇవన్నీ మొదట ప్రభావం చూపడం మొదలుపెట్టేది మన ముఖ చర్మంపైనే. అంతర్గత ఆరోగ్యానికి మొదటి సూచనగా ముఖంపై పెరిగే మచ్చలు, మొటిమలు, రంగుమారడం జరుగుతుంది.

 అలాగే సరైన శ్రద్ద తీసుకోకపోవడం వల్ల, ఎండవల్ల కూడా చర్మం కాంతిహీనంగా, నల్లగా తయారవుతుంది. ఇలా జరగడం మొదలుపెట్టగానే మనం పార్లర్ల చుట్టూ తిరుగుతుంటాం. బ్లీచ్, ఫేషియల్ అంటూ అనేక రసాయనాలతో తయారయిన క్రీములు వాడడం వలన కాలక్రమంలో అవి కూడా చర్మ ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. కానీ మనం కొన్ని ఇంటి చిట్కాలతోనే మన చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. అవేంటో చూసేద్దాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి

దానికోసం మనం తీసుకోవలసిన పదార్థాలు. బంతిపూల రేకులు, గులాబీ రేకులు, కస్తూరీ పసుపు, పచ్చిపాలు. బంతిపూల రేకులు, గులాబీ రేకులను కొద్దిగా నీళ్ళు కలిపి పేస్ట్లా చేసుకుని పెట్టుకోవాలి. ఇవి ఫ్రిజ్లో ఉంచి ఐదురోజుల వరకూ ఉపయోగించవచ్చు. వీలైతే ఎప్పటికప్పుడు చేసుకోవడం మంచిది. ఈ పేస్ట్ ను  ఒక చెంచాడు తీసుకుని ఇందులో 4 స్పూన్ల పచ్చి పాలు, ఒక స్పూన్ కస్తూరీ పసుపు కలపాలి.

 ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజూ రాత్రి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత  ముఖాన్ని మామూలు నీళ్ళతో కడిగేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వాడడం వలన చర్మంపైన ఉండే జిడ్డు, నూనెకారడం తగ్గుతుంది. కస్తూరి పసుపు వలన మన చర్మంపైన మొదటిసారే మంచి ఫలితం కనిపిస్తుంది.

 ఇది క్రమం తప్పకుండా వాడడం వలన చర్మంపైన  ఉండే మలినాలు తొలగి రంగులో మంచిమార్పు వస్తుంది.

 రాత్రి పూట వాడడం వలన చర్మానికి విశ్రాంతి లభించి రెండు రెట్లు ఫలితాలు వస్తాయి. బంతిపూల, గులాబీలు వాడడం వలన చర్మం పైన ఏర్పడే మచ్చలు, నల్లదనం, ఎలర్జీలు తగ్గిపోతాయి. పచ్చిపాలు సహజ క్లెన్సర్లా పనిచేసి ముఖాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది.

1 thought on “రాత్రిపూట ఇది రాస్తే చాలు మీ ముఖంపై ఉన్న నలుపు మొత్తం పోయి కాంతివంతంగా మెరిసిపోతారు.. fairness”

Leave a Comment

error: Content is protected !!