33-years-man-in-surat-gym-sudden-death-due-to-cardiac-arrest

మరణం ఇలా కూడా వస్తుందని ఈ వీడియో చూడకపోతే ఎవరూ నమ్మేవారే కాదు

మనిషి జీవితం ఎలా మొదలవుతుందో తెలుస్తుంది కానీ ఎలా ముగిసిపోతుంది అనేది ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే కొందరి జీవితంలో మరణం కూడా ఎవరూ ఊహించని విధంగానే వస్తూ ఉంటుంది. అందుకు ఉదాహరణ ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన. 

సూరత్ జరిగిన ఒక వ్యక్తి మరణం మనిషి బ్రతుకు ఎంత అశాశ్వతమైనదో చెప్పడంలో ఒక ఉదాహరణగా నిలిచింది. అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు అంటూ ఉంటారు. అది ఏ విషయంలో అయినా సరే నిజమని ఎప్పుడూ రుజువవుతూనే ఉంటుంది. 

 ఒక వ్యక్తి తన పరిమితికి మించి వ్యాయామం చేయడం వలన గుండె ఆగి మరణించిన సంఘటన సూరత్ లోని ఒక జిమ్లో జరిగింది. సూరత్లోని గోల్డ్ జిమ్ అనే పేరున్న జిమ్లో ఒక 33 ఏళ్ల వ్యక్తి అప్పటివరకు వ్యాయామం చేసి ఏదో ఇబ్బందిగా అనిపించడంతో మెట్లపై కూర్చున్నాడు.

 అతడు ఇబ్బందిగా చేతులను, గుండెను రుద్దుకోవడం చేస్తున్నాడు. తర్వాత మంచినీళ్లు తాగి అటు ఇటు తిరగడం చేస్తూ ఉన్నాడు. ఇలా ఒకసారి లేచి మళ్ళీ వచ్చి మెట్లపై కూర్చుని నొప్పికి గుండె రుద్దుకుంటూ ఒక్కసారిగా మెట్లపై నుండి ముందుకు కుప్పకూలిపోయాడు. 

అతడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లినా అప్పటికే మరణించినట్లు చెప్పారు. అతడు గుండె పట్టేయడం (కార్డియాక్ అరెస్ట్) వలనే మరణించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఈ సంఘటనంతా జిమ్ లోని సిసి కెమెరాల్లో రికార్డవడంతో ఇప్పుడు ఈ సంఘటన వైరల్గా మారింది. చూసిన ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

 అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? 

 ఊహించని విధంగా గుండె పనితీరు ఆగిపోవడం వలన అవయవాలకు రక్తప్రసరణ ఆగిపోయి శ్వాస మరియు స్పృహ కోల్పోవడం జరుగుతుంది. ఇలా కార్డియాక్ అరెస్ట్‌లో గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతే సత్వరం స్పందించి వైద్య సహాయం అందించాలి. లేకపోతే అది వ్యక్తి మరణానికి దారితీస్తుంది. 

ఈ సంఘటనలో సమయానికి అతడు ఎవరినీ సహాయం కోరకపోవడం బహుశా అతని విషయంలో మరణానికి దారితీసి ఉండవచ్చు. వెంటనే స్పందించి ఉంటే అతడు బ్రతికి ఉండేవాడేమో. అందుకే ఆరోగ్య విషయాలపై అందరికీ కనీస అవగాహన ఉండాలి అంటారు.

Leave a Comment

error: Content is protected !!