బయట స్వీటీనింగ్ ఏజెంట్ లాగా పంచదారకు బదులు చాలా వాటిలో కార్న్ సిరప్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తేనెలో ఎక్కువగా కల్తీ జరగడానికి కూడా కార్న్ సిరప్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బయటికి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది గడ్డ కట్టదు. ఏదైనా పంచదార కానీ బెల్లం కానీ ఉపయోగించినప్పుడు అవి కొంత కాలానికి గడ్డ కింద కడతాయి. ఈ కార్న్ సిరప్ గడ్డకట్టదు కాబట్టి తేనెలో కల్తీకి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే కూల్ డ్రింక్ లలో కూడా కొంచెం తీపికి కార్న్ సిరప్ ని ఉపయోగిస్తున్నారు.
అలాగే బేకరీలో కేక్స్ తయారీకి కూడా ఎక్కువ కార్న్ సిరప్ ని ఉపయోగిస్తున్నారు. అలాగే క్రీమ్ బిస్కెట్స్ లో, చాక్లెట్స్ లో తీపికి కార్న్ సిరప్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది గడ్డ కట్టదు. ఇది పంచదార లాగా సెటిలై అదొక రకంగా రాదు. అంతేకాకుండా తక్కువలో ఎక్కువ తీపి నిచ్చె విధంగా ఉంటుంది. కాన్సన్ట్రేటర్ ఫామ్ వలన ఎక్కువగా వీటిలో ఉపయోగిస్తున్నారు. అలాగే జామ్స్ లోను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలాగా కార్న్ సిరప్ ను ఎక్కువగా ఉపయోగించడం. వీటిని బయట ఎక్కువగా కొనుక్కొని తినడం వలన లోపలికి ఎక్కువగా కార్న్ సిరప్ వెళ్ళిపోతుంది.
దీని ద్వారా జరిగే నష్టం ఏమిటంటే ఈ సిరప్ లో యాసిడ్ యొక్క గాఢత ఎంత ఉంటుంది అంటే 2.5-3.5 పీహెచ్ ఉంటుంది. మన ఉపయోగించే టాయిలెట్ క్లీనర్ యొక్క పీహెచ్ కు ఇది దగ్గర దగ్గరగా ఉంటుంది. ఇలా కార్న్ సిరప్ ఉపయోగించడం వలన ముఖ్యంగా దంతాలు యొక్క ఎనామిల్ పొర దెబ్బతింటుంది. ఎముకలు గుల్లబారి పోవడానికి కార్న్ సిరప్ యొక్క పీహెచ్ ఒక కారణం. అలాగే దీనితోపాటు ఈ కార్న్ సిరప్ వాడినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఎక్కువ అవుతుంది. అంటే ఇన్సులిన్ చెప్పిన మాట మన కణాలు సరిగ్గా వినవు.
అందువలన టైప్ టు డయాబెటిస్ రావడానికి ఇండైరెక్ట్ గా ఇది ఒక కారణం. అందువలన ఇటువంటి నష్టాలు అన్ని కార్న్ సిరప్ ఉపయోగించడం వలన కలుగుతాయి. బయట తయారు చేసే పదార్థాలు అని ఎంత హైజానికైనా అందులో ఉపయోగించే పదార్థాలు మాత్రం మనకు హానికరం కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని ఉపయోగించకపోవడం మంచిది…