5 Healthy and Tasty Hot Beverages

5 Healthy and Tasty Hot Beverages తప్పక Try చేయండి (టీ తాగడం మర్చిపోతారు )

చలికాలంలో వేడివేడిగా ఏమైనా తాగాలనిపిస్తుంది.అలా అని టీ కాఫీలు తాగడంవలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఇంట్లోనే హెల్త్ డ్రింక్స్ తయారు చేసుకుందాం.అవేంటో చూద్దాం.

1.మొదటిది బేసన్ సీరా:

ధమదీనిని తయారు చేయడానికి ఒక పాన్ తక్కువ మంటపై పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో ఒకటిన్నర స్పూన్ శనగపిండి వేయాలి. అది కొంచెం కలపండి.అందులో నాలుగయిదు బాదం వేయండి.దీనిని తక్కువ మంటపై  వేడిచేస్తు బాగా కలపాలి. రంగు మారి మంచివాసన వచ్చాక ఒక పెద్ద గ్లాసు వేడిపాలు వేయాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లంపొడి వేయండి. చిటికెడు మిరియాల పొడి వేసి రెండు నిమిషాలు మరిగించండి. బెల్లం వాడడంవలన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. ఇది జలుబు‌, దగ్గు నుండి, మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రొటీన్లు, కాల్షియం ఎముకలను ధృడంగా చేస్తాయి. ఇది ఉదయాన్నే తీసుకోవడం వలన మధ్యాహ్నం వరకూ ఆకలి వేయదు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

2. పుదీనా మసాలా టీ :

అరలీటర్ నీటిలో చిన్న అల్లం ముక్క,  పుదీనా, దాల్చిన చెక్క ,యాలకులు వేయండి. తర్వాత మూతపెట్టి తక్కువ మంటమీద మరిగించండి. దానివలన అన్ని పదార్థాలు సారం నీటిలో దిగుతుంది. తర్వాత చల్లార్చి  వడకట్టి తీసుకోండి. ఇందులో ఉన్న పదార్థాలు వలన కొవ్వు కరగడం, ఎసిడిటీ, బ్లోటింగ్ , కంట్రోల్ బ్లడ్ షుగర్, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. 

3. పీనట్ హాట్ చాక్లెట్:

ఒక గ్లాసు పాలు తీసుకుని ఒక టీ స్పూన్ కొకొవా పౌడర్ వేయండి.  ఒక పెద్ద టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వెయ్యండి.అలాగే చిన్న దాల్చిన చెక్క కూడా. తక్కువ మంటమీద కలుపుతూ ఉండండి. దీంట్లో తీపి కోసం ఎండు ఖర్జూరం పొడి లేదా బెల్లం ,పటికబెల్లం వేసుకోవచ్చు. బరువు తక్కువ ఉన్నవారికి మంచి ఆహారం. ఆరోగ్యంగా బరువు పెరగొచ్చు. దీంట్లో ఉండే ప్రొటీన్లు, కండరాలు పెరుగుదల,మదడు పనితీరు మెరుగుపరచడం, గుండె ఆరోగ్యం కాపాడటం ,రక్తపోటు ను తగ్గిస్తుంది. 

4.వెజ్ డిలైట్ :-

ఒక గిన్నెలో అరలీటర్ నీరు పెట్టి అందులో రెండు లవంగాలను వేయండి. ఇందులో తరిగిన కేరట్, బీన్స్, పచ్చి బఠాణీ అలాగే మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. అందులో కొంచెం ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత మీడియం మంట మీద ఐదు నిమిషాలు మరిగించి తర్వాత మంటకట్టేసి కొంచెం చల్లారాక నిమ్మకాయ పిండి కూరగాయలు తో సహా తీసుకోవాలి.  ఇది చాలా ఆరోగ్యకరమైనది మరియు రుచికరమైనది. మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. 

5.అశ్వగంధ పాలు:-

ఒకగ్లాసు పాలు తీసుకుని ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడి వేసుకోండి.ఒక ఇలాచి, ఒక చిన్న టీస్పూన్ పసుపు, కొద్దిగా మిరియాల పొడి, ఒకచెంచా నెయ్యి యాడ్ చెయ్యాలి. తర్వాత చిన్నమంటపై మరిగించాలి. రోట్లో రెండు జీడిపప్పు, రెండు బాదం, రెండు వాల్నట్స్ వేసుకుని బాగా దంచి పాలల్లో కలపండి. మరిగాక చల్లార్చి గ్లాసు లోకి తీసుకోండి. దీనిని వడకట్టవలసిన అవసరం లేదు. దీనిలో తీపికోసం బెల్లంపొడి కలపండి. దీనిని పడుకోవడానికి గంటముందు తీసుకోండి. ఇది టెస్టోస్టిరాన్ లెవల్స్ పెంచుతుంది . మెదడును రిలాక్స్ చేస్తుంది. నిద్రలేమి దూరంచేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బాడీ బిల్డింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది.  పాలు తాగనట్టయితే ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్ వేసుకోవచ్చు. అలాగే రాగిమాల్ట్, గ్రీన్ టీ‌, తులసి టీ మరియు గ్లాసు వేడినీరు తాగిన కూడా ఆరోగ్యం తో పాటు చలినుండి ఉపశమనం లభిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!