ఈమధ్య కాలంలో గొంతుకు ఏ చిన్న సమస్య వచ్చినా కరోనా ఏమో అనే భయం ఎక్కువ అయింది ప్రజలలో. మారుతున్న వాతావరణం, వేసవిలో తీసుకుంటున్న చల్లని పానీయాలు, పండ్లు, తీపి పదార్థాలు, ముఖ్యంగా సరిగా పెరగని మామిడి కాయలు, మామిడి పిందెలు తినడం ఇలాంటి వాటి వల్ల గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్ చాలా తొందరగా వస్తుంది. అయితే ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటిస్తే ఆ గొంతు నొప్పిని డాక్టర్స్ దగ్గరకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోనే సులువుగా తగ్గించుకోవచ్చు మరి అవేంటో చదివేయండి.
ఉప్పు నీటితో పుక్కిలించడం.
వెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల గొంతుకు తొందరగా ఉపశమనం వస్తుంది. ఉప్పు గొంతులో వాపు, ఎర్రబడిన కణజాలం నుండి శ్లేష్మం బయటకు లాగి అసౌకర్యాన్ని తొలగించడానికి సహాయపడుతుంది.
నొప్పి నివారణకు
చాలా వైరస్లు గొంతు నొప్పికి కారణమవుతాయి. వైరస్‌లను యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయలేము, ఇవి బ్యాక్టీరియాను మాత్రమే చంపుతాయి. వైరస్ నివారణ కోసం ఇబుప్రోఫెన్ లేదా నాప్రోక్సెన్ వంటి నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడాలి. ఇవి గొంతులో మంట మరియు వాపును తగ్గిస్తాయి.
తేనె తో ఉపశమనం
తేనె కలిపిన తియ్యని టీ, గోరివెచ్చగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల ఎదురయ్యే గొంతు చికాకును పోగొడుతుంది. అలాగే ఇది హైడ్రేట్ గా ఉంచుతుంది, గ్రీన్ టీ కూడా ఉత్తమ ఎంపిక ఇది యాంటీ బాక్టీరియల్, పెయిన్ రిలీవర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ యొక్క గొప్ప వనరుగా పనిచేస్తుంది, అలాగే మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
హైడ్రేటెడ్ గా ఉండడం
గొంతు నొప్పి తగ్గించుకోవడంలో భాగంగా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. డీహైడ్రేషన్ వల్ల గొంతు సహజంగానే పొడిగా మారిపోతుంది. శరీరం తగినంత లాలాజలం మరియు శ్లేష్మం ఉత్పత్తి చేయదు. ఇది వాపు మరియు మంటను మరింత పెంచేలా చేస్తుంది. వెచ్చని టీలు లేదా వెచ్చని సూప్‌ల కంటే మంచి నీళ్ళు ఉత్తమం. వేడి టీ లేదా వేడి సూప్, అయితే గొంతు మంట, నోపాలిని మరింత పెంచుతాయి. అలాగే కెఫిన్ మరియు ఆల్కహాల్ మానుకోవాలి , ఇవి మిమ్మల్ని మరింత గొంతు ఎండిపోయేలా చేస్తాయి.
తేమ కలిగిన ప్రదేశంలో ఉండటం
తేమగా ఉండే గాలిలో శ్వాస తీసుకోవడం వల్ల ముక్కు మరియు గొంతులోని వాపు కణజాలం ఉపశమనం పొందవచ్చు.
ఆవిరి పట్టుకోవడం
అన్ని సమస్యలకు ఒక ఉత్తమ పరిష్కారం ఆవిరి పట్టుకోవడం. నీటిని బాగా మరిగించి అందులో అమృతాంజనం లేదా నీలగిరి తైలం లేదా మింట్ ఆయిల్ వంటివి వేడి నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల చాలా ఉపశమనం ఉంటుంది.
చివరగా…..
గొంతు ఇన్ఫెక్షన్ అనేది సాధారణమైన సమస్య. దీన్ని చూడగానే భయపడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే గొంతు నొప్పి మాయం.
గమనిక : ఈ వెబ్ సైట్ లో పెడుతున్న వివరాలన్నీ పాఠకుల ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా పాఠకుల అవగాహన పెంచడానికి మాత్రమే ..ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు