5 Important Benefits Of Wheatgrass Juice

అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను దాచుకున్న గోధుమనారు తీసుకునే పద్దతి తెలుసా??

“ఈర్ప్ థామస్” అనే పరిశోధకుడు 4700  రకాల గడ్డిపరకల్ని పరిశీలించి వీటిలో వీటిలో గోధుమ నారుకు మంచి ఔషధ ప్రయోనాలు  ఉన్నాయని తేల్చాడు. గోధుమ నారులో విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్, అనేక ఎంజైములు పుష్కలంగా ఉన్నాయి.

క్యారెట్ లో కన్న ఎక్కువ విటమిన్ ఎ మరియు, కమలలో కన్నా ఎక్కువ విటమిన్ సి గోధుమ నారులో ఉంటాయి. సంపూర్ణ ఆహారం అనదగిన అన్ని ప్రయోజనాలు గోధుమ నారులో నుండే లభిస్తాయంటే ఆశ్చర్యమేస్తుంది కానీ ఇదే నిజం. చర్మానికి పోషణ, కాంతి, రంగు ఇవ్వడంతో పాటు జుట్టు నల్లగా వత్తుగా పెరగడంలో గోధుమనారు దోహాధం చేస్తుంది. ఇన్ని పోషకాలు కలిగిన గోధుమ నారు ఎలా తీసుకోవాలో చూద్దాం మరి.

◆ శుభ్రం చేసి దంచి తీసిన గోధుమనారు రసాన్ని ఖాళీ కాదువుతో తీసుకుంటే 20 నిమిషాల్లో శరీరంలో ఇమిడిపోతుంది.

◆ ఇది చేదు కషాయంగా, పసరు వాసనతో, వికారంగా, వాంతి పుట్టించేలా ఉంటుందని చాలా మంది అంటారు కానీ ఇది వాస్తవం కాదు. మొలకెత్తిన శనగల్లో మొలకల రుచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది కూడా. అయితే గోధుమ నారు ఆకుపచ్చదనం ఉంటుంది.

◆ రుచి సువాసనల కోసం కొత్తిమీరనో, మిరియాల పొడినో, అల్లం, జీలకర్ర, ధనియాలు వంటి పొడి నో కలుపుకుని తాగచ్చు. వీటిని కలపడం వల్ల గోధుమ నారులో పోషకాలు ఏమాత్రం తగ్గవు.

◆ గోధుమ నారును తీసుకోవడం ఇష్టపడకపోతే దీన్ని చారులాగా కాచుకుని తీసుకోవచ్చు, లేదంటే సూప్ రూపంలోనూ తీసుకోవచ్చు.

◆ కూరల్లో, పచ్చళ్ళలో కొత్తిమీర, పుదీనా వంటి వాటితో కలిపి గోధుమనారు ను కూడా జోడించవచ్చు.

◆ కొన్ని వాత వ్యాధులలో మోకాలు తదితర జాయింట్ల వ్యాధులలో కండరాలు బాగా దెబ్బతిని ఉంటాయి. జాయింట్స్ కు లింఫ్ సరఫరాలో అడ్డుపడే మ్యుకస్ ని బ్రేక్ చేసి జాయింట్స్ ని మళ్ళీ నిలబెట్టేందుకు గోధుమనారు అద్భుతంగా పనిచేస్తుంది.

◆ ఏదో ఒక రూపంలో గోధుమనారును ఆహార పదార్థంగానైనా  సరే తీసుకోవడం ప్రారంభించడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

◆ గోధుమ నారును పెంచలేని వారు, మరియు తినలేని వారు  కనీసం 4-5 రోజుల వయసున్న గోధుమ మొలకల్ని నిరభ్యరంతంగా తీసుకోవచ్చు.

◆ గోధుమ మొలకలు కూడా ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాన్సర్ లాంటి జబ్బులలో  ప్రాణాపాయ స్థితిని తప్పిస్తూ శరీరంలో విషాల్ని తొలగించి అద్భుతమైన పోషణను ఇచ్చే ఇలాంటి ప్రకృతి ప్రసాదాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

◆గోధుమ నారు తీసుకోవడం వల్ల రక్తపోటు నెమ్మదిస్తుంది.  ఎర్ర రక్తకణాలు అద్భుతమైన రీతిలో అభివృద్ధి చెందుతాయి.  మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని తీసుకోవడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి.

చివరగా…..

గోధుమ నారు లేదా గోధుమ గడ్డి, బయట  మార్కెట్లలో ధర కడ్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి దీన్ని కొంచం ఓపికతో ఇంట్లోనే పెంచుకోవడం వల్ల పైన చెపుకున్న బోలెడు ప్రయోజనాలతో పాటు గొప్ప ఆరోగ్యం సొంతమవుతుంది.

Leave a Comment

error: Content is protected !!